Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కలెక్టరుకు మొర పెట్టుకున్న గిరిజన బిడ్డ

ఈరోజుటీవి/జగిత్యాల/కలెక్టరేట్/క్రైమ్: తెలంగాణ లో ఎన్నికల ముచ్చట అధికారికంగా గడిచినప్పటికీ  రాష్ట్రం లో ఇంకా దాని తాలూకు కొన్ని విషయాలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యం లో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కు చెందిన ఓ గిరిజన బిడ్డ తనను నోటికి వచ్చినట్లు తిట్టినాడని ఈ రోజు కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. అసలు ఏమైందో తెలియాలంటే మనం ఓ సారి అసెంబ్లీ ఎన్నికల రోజు నాటికి వెళ్లాల్సిందే. ఎందుకని అంటారా అవునండి, అసలు మతలబు అక్కడే మొదలు అయిందని తెలుస్తున్నది. జగిత్యాల నియోజకవర్గ ఎన్నికల బరిలో అన్ని పార్టీల వారు పోటీలో ఉండగా, రాయికల్ మండలం కు చెందిన భూక్యా లక్ష్మి భర్త గంగారాం అనే వారు తెరాస కు అనుభందం గా 2001 నుండి పని చేస్తున్నారని అయితే ఎన్నికల వేళా వారి కుల సంఘాల ఒత్తిడి తో తానూ జగిత్యాల నియోజకవర్గ స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉండటం తో తెరాస పార్టీ కి చెందిన అభ్యర్థి అయినా డా. సంజయ్ కుమార్ వారి ఇంటికి వెళ్లి పోటీ నుండి తప్పుకోవాలని చెప్పగా, తన మాటలకు కట్టుబడి పోటీ నుండి వైదొలిగానని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా గెలిచినా తరువాత ఎమ్మెల్యే ను కలిసి అభినందనలు తెలుపుట కోసం మోతే రోడ్ లో గల తెరాస పార్టీ కార్యాలయం కు వెళ్లగా తనను  చూసిన జగిత్యాల ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలం అయినట్లు, ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటూ బండబూతులు తిట్టాడని, అందరి ముందు అవమానం గా భావించి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి ఈ రోజు కలెక్టరు సారుకు మోర పెట్టుకున్నట్లు పేర్కొన్నది. ఏది ఏమైనా ఇలాంటి వి జరగడం దురదృష్టకరమే అయినప్పటికీ అసలు ఏమి జరిగిందో, జగిత్యాల ఎమ్మెల్యే ఈ గిరిజన బిడ్డ చేస్తున్న అభియోగం కు ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

Please follow and like us:

You may also like...