వైభవంగా సోమేశ్వర స్వామికి అన్నాభిషేకం
అభిషేకం ఘనం గా నిర్వహించిన అర్చకులు
ఈరోజుటీవి/పశ్చిమగోదావరి జిల్లా/పెనుమంట్ర మండలం: ప్రక్రుతి విపత్తుల వలన వచ్చే ప్రమాదాలు తగ్గాలని ఉద్దేశ్యం తో ఈ అభిషేకం నిర్వహిచాం అని తెలియజేసిన ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞ శ్రీనివాస శర్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రముఖ శైవక్షేత్రం గా విరాజిల్లుతున్న జుత్తిగ గ్రామం
శ్రీ ఉమావసూకీ రవి సోమేశ్వర స్వామివారికి మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా సముహికముగా “అన్నాభిషేకం” నిర్వహించామని స్పష్టం చేసారు.
దేశం సస్య స్యామలం గా ధనధాన్యాభివృద్ధి గా ఉండుటకై శివాలయం లో ప్రతి సంవత్సరం మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రం రోజున అన్నభిషేకం చేయాలని ప్రముఖ వేదార్ధ పండితులు దేవాదాయ శాఖ ఆగమ కమిటి అధ్యక్షులు, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ చిర్రావూరి. శ్రీ రామ శర్మ గారి ఆదేశం తో….. శ్రీ ఉమావసుకి రవి సోమేశ్వర స్వామి వారికి భక్తులచే సాముహికముగా ఆదివారం రోజున అన్నభిషేకం వైభవంగా జరిగినది.
ఈ అభిషేకం ప్రధాన ఉద్దేశ్యం, దేశం సస్య స్యామలం గా ధనదాన్యభివ్రుద్ధి గా ఉండాలని, రాష్ట్రం లో ప్రమాదకరమైన విపత్తులు సంభవించకుండా, ప్రక్రుతి వలన వచ్చే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాలని ప్రజలు సుఖసంపత్ సౌభాగ్యాలతో జీవించాలని, స్వామికి అన్నాభిషేకం ప్రధాన ఉద్దేశ్యం తో ఈ అభిషేకం నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ. ప్రసాద్ , సీనియర్ సహాయకులు గానేశ్వరరావు , ఆలయ అర్చకులు , భక్తులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు క్రింది వీడియో చూడండి.