జనవరి 27 తేదీపై పునరాలోచన చేయాలి.
ఈరోజుటీవి/రాయికల్: తెలంగాణ లో స్థానిక ఎన్నికలు 27 జనవరిన 2019 న మూడవ విడత ఎన్నికలు జరిగే అవకాశం వుందని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుచున్న, దినపత్రికల్లో ముద్రితమైన సమాచారం సందర్భంగా తమరికి ఇట్టి వినతిని పంపనైనది. 26 జనవరి న గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఎన్నికల విధులు 90 శాతంపైగా ఉపాధ్యాయులకే వస్తాయి. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఊరేగింపులు, గ్రామాల్లో గల జండాల ఆవిష్కరణ, బహుమతుల ప్రధానం, వక్తల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మిఠాయిల పంపిణీ తదితర అనేక కార్యక్రమాలు పూర్తయ్యే సరికే మధ్యాహ్నం, కొన్నిచోట్ల అయితే సాయంత్రం కూడా అవుతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులు వచ్చిన ఉపాధ్యాయులు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేసి సామాగ్రి పొందాల్సివుంటది. కావున ఎన్నికల విధులు వచ్చిన ఉద్యోగ ఉపాద్యాయులు జనవరి 26 న సూచించిన సమయానికి రిపోర్ట్ చేయడం సాధ్యం కాక పోవచ్చు సాయంత్రం, రాత్రి కూడా అయ్యే అవకాశాలుంటాయి. కావున ఇట్టి సామాజిక మాధ్యమాల వార్తలు నిజమైతే 26 న రిపోర్ట్ చేయాల్సిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాల పూర్తి ముగించుకొని సాయంత్రం, రాత్రి వరకు రిపోర్ట్ చేసేందుకు అనుమతించాలని, లేనిచో అవకాశం వుంటే మూడవ విడత తేది 27 కు బదులుగా మరొక రోజు మూడవ విడత ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేయాలని, ప్రత్యామ్నాయం చూడాలని టి.వై.యం.ఎస్.ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతి పత్రం పంపినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేల్పుల స్వామి యాదవ్, సందనవేని కుమార్ యాదవ్ లు తెలిపారు.