Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

దివిసీమలో గంజాయి పట్టివేత…

ఈరోజుటీవి/కృష్ణాజిల్లా/క్రైమ్: ఆంద్రప్రదేశ్ కృష్ణాజిల్లా అవనిగడ్డ సరిహద్దులు దాటుతుండగా పథకం ప్రకారం పట్టుకున్న అవనిగడ్డ పోలీసులు. వివరాల్లోకి వెళితే ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్తుండగా పులిగడ్డ చెక్ పోస్ట్ వద్ద మహీంద్రా బొలెరో వాహనం లో దొరికిన గంజాయి. వాహనం ను తనిఖీ చేస్తుండగా అందులో వారు అమర్చిన రహస్య స్థావరం ను గుర్తించడం జరిగింది. అదీ బొలెరో ట్రక్ బాడీలో రహస్యంగా చేయబడిన అరలో 2 కిలోల చొప్పున 50 గంజాయి పాకెట్లను ఎవరికీ అనుమానం రాకుండా అందులో భద్రపరిచి రవాణా చేస్తున్నట్లు తనిఖీల అనంతరం తెలిసింది. ఆ గంజాయి కి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ అని తెలుస్తోంది. అందులో ప్రయాణిస్తున్న అంటే గంజాయికి ని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు షేక్ మహబూబ్ వలి (50),
డ్రైవర్, గాజుపల్లె, మహానంది మండలం, కర్నూలు జిల్లా కు చెందిన అతను కాగా, మరో వ్యక్తి జింకల మద్దిలేటి (25), బోయల కుంట్ల గ్రామం, సిరివేళ్ళ మండలం, కర్నూల్ జిల్లా కు చెందిన అతనిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం తనిఖీల్లో వాహనంలో దొరికిన గంజాయి దాని విలువ సుమారు 100 కిలో లు గా లెక్కలు చెబుతుండగా దాదాపు అది రూ.30 లక్ష లు అవుతుందని చెబుతున్నారు.

Please follow and like us:

You may also like...