Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

రామన్న ఇలాకాలో ప్రాణాలకు విలువే లేదు ?

నిన్న రాత్రి రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్ కి లాక్ వేసుకొని క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న వైనం…

ఈరోజుటీవి/రాజన్న సిరిసిల్ల జిల్లా/క్రైమ్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో గల ప్రధాన ప్రభుత్వ ధర్మాసుపత్రికి రోగులు వస్తే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితే గాని, ప్రాణాలకు విలువ, ప్రాణాలను కాపాడే వ్యవస్థ లేదు. వారంతా క్రిస్మస్ పండుగ సంబరాల్లో మునిగి తేలారు. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం కు తాళం వేసి మరి అంగరంగ వైభోగం గా ఆసుపత్రిని అలంకరించి రాత్రి అంతా వేడుకల్లో వారు సంతోషాల్ని పంచుకోవడమే కాకుండా వారికి తోచిన సమాధానం ఇచ్చారు. విందు వినోదాల లో మునిగి తేలిన వైద్యులు,సిబ్బంది, అదే సమయంలో ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చిన పేషంట్  ను పట్టించుకోకపోవడంతో మృతి చెందాడు. ఇదీ మన సర్కారు ధర్మాసుపత్రి దుస్థితి. పేదలకు ఏదైనా, అంటే ఈ క్రిస్మస్ పండగ అయిపోయే లోపు ఏదైనా జరగరానిది జరిగితే, వారికి ఆ దేవుడే దిక్కని ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల లో సామాన్య ప్రజలతో పాటు, సామాజిక మాధ్యమం లో వైరల్ అయినా వైనం. చూద్దాం తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి?

Please follow and like us:

You may also like...