Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఎస్.జె.ఆర్.ఆర్.ఎస్ శ్రీవాణి విద్యాలయం మద్దునూర్ గ్రామంలో గణిత మేధావి వేడుకలు

ఈరోజుటీవి/జగిత్యాల/బ్యూరో: అపారమైన మేధోసంపత్తు కలిగిఉండి కూడ, చిన్న చిన్న పనులతో జీవితం గడిస్తే చాలు అని ఆలోచించే నేటి యువత సాధించాల్సి గొప్ప విజయాలను కోల్పోతుంది.
దానికి ఈ సంఘటననే గొప్ప ఉదాహరణ. డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పని చేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనల్లో ఇలా గుర్తు చేసుకున్నాడు.

“ ఆ నోటు పుస్తకాలలోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతటి గొప్ప విజ్ఞానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమాన పరచలేను ”

తరువాత రామస్వామి రామానుజన్‌కు కొన్ని పరిచయ లేఖలు ఇచ్చి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్ది మంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరకు పంపించారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బురపడ్డాడు. అసలు అవి అతని రచనలేనా అని సందేహం కూడా వచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్దానా గురించి, అతని రచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పాడు.

రామానుజన్ జన్మ దిన వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ గాలిపెళ్లి.మహేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజ్జెల. జానకిరామ్,విద్యార్థిని విద్యార్థులు కలిసి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది.

Please follow and like us:

You may also like...