Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జిల్లాలో అతిత్వరలో ఈ-చలాన్ వ్యవస్థ: ఎస్పీ

సమీక్ష సమావేశంలో తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ సింధు శర్మ ఐపీఎస్…ఈ చలాన్ తో ముందుకు…

ఈరోజుటీవి/జగిత్యాల జిల్లా/క్రైమ్ బ్యూరో: ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ జిల్లా పోలీసు అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ చలాన్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ట్రాఫిక్ విభాగాన్ని మరింత ఆధునీకరించడం తో పాటు డిజిటలైజేషన్ విధానాన్ని వినియోగించుకొని ట్రాఫిక్ విధులను సులభతరం చేయడం తో పాటు ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించడం ట్రాఫిక్ నిబంధనల పట్ల ఉండాల్సిన బాధ్యతలను తెలియజేసేందుకు ఈ చలాన్ విధానాన్ని జిల్లాలో అతిత్వరలో అమలు లోకి తీసుకరావడానికి సన్నద్ధం అవుతున్నామని, నగదు రహిత పద్ధతి అమలుకు సన్నాహకాలు చేస్తున్నామని తెలిపారు. రోజు వారిగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికిల్ చెకింగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ లు నిర్వహించాలని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘన చేసిన వారిపై మోటార్ వెహికిల్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని రోడ్డు ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గత నెలలో జరిగిన నేరాల గురించి, తీసుకున్న విచారణ దర్యాప్తు చర్యలు గురించే పోలీసు అధికారుల ను వివరంగా అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులు, ఆస్తి సంబంధిత నేరాలు, మహిళ సంబంధిత నేరాలు, విచారణ చర్యలపై చర్చించారు.

అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో పని చేసి సిబ్బందికి 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా నిర్ణితమైన ఉద్యోగం కల్పించడం జరుగుతుందని తెలిపారు, తదనుగుణంగా తమ సిబ్బంది తమకు కేటాయించిన భాద్యతను సక్రమంగా నిర్వర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ పెట్టి కేసులను ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించినారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పెట్టి కేసులు నమోదు చేయాలని, ప్రతి ఈ పెట్టి కేసు రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ లో చూపునని తెలియజేసారు.
జిల్లాలో పెండింగ్ లో వున్నా నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశాలు చేసినారు. దొంగతనాల నివారణ గురించి పగలు రాత్రి పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని సూచించారు.
నేర నియంత్రణ చర్యలలో భాగంగా ఆకస్మిక తనిఖీలు, కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిoచాలని తెలిపారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ నేర స్థలానికి వీలైనంత తక్కువ సమయంలో చేరి తమ సేవలను బాధితులకు అందించాలని కోరారు.
సిసిటియన్ యస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్.ఐ.అర్ లను, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. ప్రతి పి‌ఎస్ లల్లో ఇప్పటి వరకు ఉన్న లాంగ్ పెండింగ్ కేసులను గురించి ,యుఐ కేసులను గురించి కాంపౌండింగ్ కేసులను గురించి అడిగి తెలుసుకోవడము జరిగినది.

ఈ నెల 23 న జరగనున్న మెగా లోక అదాలత్ లో నిర్ధేశిత లక్ష్యం దిశగా ప్రతి ఒక అధికారి బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు.
ఈ యొక్క సమావేశంలో అదనపు ఎస్పీ మురళీధర్, డీఎస్పీ లు మల్లారెడ్డి, సీతారాములు, వెంకటరమణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రాజు, సి.ఐ లు రత్నపురం ప్రకాష్, నాగేందర్ తో పాటు డిసిఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...