Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కరీంనగర్ జిల్లాలో పర్యటించిన రాష్ట్రపతి

ఈరోజుటీవి/కరీంనగర్/బ్యూరో: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ బయల్దేరిన అయన కరీంనగర్ రూరల్  మండలం నగునూర్ గ్రామానికి చేరుకోగా ఆయనకు తెలంగాణ గవర్నర్ మరియు మహారాష్ట్ర గవర్నర్ తో పాటు పలువురు అధికారులు ప్రజాప్రతినిథులు ఘన స్వాగతం పలికారు. నగునూర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను ప్రారంభించిన తరువాత ఎంబిబిఎస్ లో ప్రతిభను కనబరిచిన పలువురు విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. అనంతరం అయన విద్యార్థులను ఉద్దేశించి సభలో ప్రసంగించిన తరుతావా, అక్కడి నుండి హెలికాఫ్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ లోని బొల్లరాంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు.

Please follow and like us:

You may also like...