జనవరి 17న పంచాయతీ ఎన్నికలు..?
రెండు రోజుల్లో రిజర్వేషన్ ఖరారు.. అధికారికంగా ప్రకటన

ఈరోజుటివి/హైదరాబాద్: తెలంగాణ లో గ్రామ పంచాయతీలకు మూడు విడతలు గా ఎన్నికలు జరపడానికి సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపధ్యం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రిజర్వేషన్ల మీద ఓ ఆలోచన చేసి కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈరోజో, రేపో ఖచ్చితంగా రిజర్వేషన్ల ప్రక్రియకు ముగింపు కార్డు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతున్నది. ఇది లా ఉండగా రాష్ట్రం లో దాదాపు గా చూసినట్లయితే మహిళా ఓటర్ల శాతం పై ఈ సారి దృష్టి పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం వారికి 50% కు రిజర్వేషన్లే కేటాయింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల 27 న షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్నాడని తెలుస్తోంది. జనవరి3న తొలిదశకు నోటిఫికేషన్ విడుదల కు సంసిద్ధం అయితున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ కు అవకాశం ఇవ్వగా జనవరి 5న ఆఖరుతేది గా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
6న స్ర్కూట్ని.. 7న ఉపసంహారణ..? జనవరి 7న రెండవ దశకు నోటిఫికేషన్.. ?
అదే రోజు నామినేషన్ల ప్రారంభం..9న ఆఖరు గడువు..10న స్ర్కూట్ని.. 11న ఉపసంహారణ..? జనవరి 21న మధ్యాహ్నం 1 వరకు పోలింగ్.. 2గంటలకు కౌంటింగ్.. ఫలితాలు విడుదల..?
జనవరి 17న మద్యాహ్నం1వరకు పోలింగ్..? 2గంటలకు కౌంటింగ్ ప్రారంభం..ఫలితాలు విడుదల..
జనవరి 15న మూడవ దశకు నోటిఫికేషన్..?
అదేరోజు నామినేషన్ల ప్రక్రీయా షూరు..17న ఆఖరు గడువు..18న స్ర్కూట్ని..19న ఉపసంహారణ..
జనవరి 27న పోలింగ్..?
మధ్యాహ్నం1వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్..ఫలితాలు విడుదల..?