Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

శాసన సభాపతిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు?

ప్రజలంతా తెరాస వైపు ఉన్నారు, మేము కూడా ప్రజలవైపు ఉండాలనుకుంటున్నాం !                                                                   కాంగ్రేస్ పార్టీలో గౌరవం లేదని వెల్లడి..

ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో చీఫ్: శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు,దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్ తమ వర్గాన్ని తెరాస శాసనసభా పక్షం లో విలీనం చేయాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ టిడిపి తో పొత్తే కాంగ్రెస్ ను కొంపముంచింద ని కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పే పెద్దలు ఈ విషయం లో మాకు ఎవరితో చెప్పకుండా ఎలా పొత్తు పెట్టుకున్నార ని ఈ సందర్బంగా ప్రశ్నించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ లో నాయకత్వ లేమి ఉందని స్పష్టం చేసిన ఆయన, అందుకే టిఆర్ ఎస్ లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాం అని స్పష్టం చేసారు. ఇది ఇలాగ ఉండగా మరో నేత ప్రభాకర్. ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాము అనగా ప్రస్తుతం 2/3 సభ్యులం కాంగ్రెస్ ఎల్పీ నీ టిఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయాలని ముందుకు వచ్చామ ని స్పష్టం చేసారని తెలుస్తోంది. ఇది ఇలాగ ఉండగా ఆయన మాట్లాడుతూ తాము రాజ్యాంగం కు కట్టుబడి, దానికి లోబడే అంటే రాజ్యాంగం ప్రకారం 2/3 సభ్యులు కలిసి నిర్ణయం తీసుకోవచ్చు కనుక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం

రూల్ పోసిషన్ చూసి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామి గౌడ్ చెప్పార ని తెలుస్తోంది. ఈ సందర్బంగా మరో నాయకురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో మాకెన్నో అవమానాలు జరిగాయ ని గుర్తు చేసిన
ఆకుల లలిత, ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న బడుగు బలహీన వర్గాల తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ల ప్రజలందరూ టిఆర్ ఎస్ వైపు వున్నార ని అంటూ, తాము కూడా ప్రజా క్షేత్రం లో విఫలమైన కాంగ్రెస్ లాంటి పార్టీ లో ఉండదలుచుకోలేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్న ప్రభుత్వం వైపు ఉంటె మరింత సేవ చేసే అవకాశం దక్కుతుందని అలాగే ప్రజలకు బాసటగా ఉంటె మరిన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఉంది గనుక, అంతే కాకుండా ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కానీ ప్రస్తుతం మేము ప్రజల వైపు వుండాలనుకుంటున్నాం.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని స్పష్టం చేశారు. ఇలా మేము తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి మమ్మల్ని మా ఆకాంక్షలను గుర్తించి కేసీఆర్ మాకు తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నాం.

వచ్చే లోకల్ బాడీ, పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం అని ఈ సందర్బంగా పార్టీ మారిన ఎమ్మెల్సీలు స్పష్టం చేసారు.

Please follow and like us:

You may also like...