Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఘనంగా జియారత్ వేడుకలు

ఈరోజు టీవీ న్యూస్..మా ప్రతినిధి సురేష్ గౌడ్ 
కర్నూలు జిల్లా…
మహానంది/తిమ్మాపురం: మహానంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలో పెద్ద మౌలాలి, చిన్నమౌలాలి, దస్తగిరి స్వామివారి పీర్ల జాతర (జియారత్) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముజావార్ లు, ఖాజాహుస్సేన్ పీర్లకు చదివింపులు కార్యక్రమం చేసారు. మౌలాలి స్వామి నిర్వాహక కమిటీ అధర్వంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాత్రి భజన గురువు పీర్ షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్కభజన కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ నేపధ్యం లో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు ముజహరి ఫాతేహాలు (చదివింపులు) సమర్పించారు. ఇది ఇలా ఉండగా పీర్ల జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం తో రాత్రి వేళ అయినందున జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, అలాగే అసౌకర్యం కలగకుండా ముందస్తుగా మహానంది యస్ ఐ.తులసి నాగ ప్రసాద్ పోలీసుల తో పూర్తిస్థాయి లో బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు లో పోలీసులు వెంకటస్వామి, శ్రీను మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఉదయం జరిగిన పీర్ల ఊరేగింపు లో కూడా ప్రజలు దర్శనం చేసుకున్నారు. రాత్రి ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన మహానంది ఎస్సై కి పోలీసు శాఖ కు మౌలాలి స్వామి నిర్వాహక కమిటీ అభినందనలు తెలిపినారు.

Please follow and like us:

You may also like...