Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి : ఎస్.ఎఫ్.ఐ

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్ బ్యూరో: ఈరోజు ప్రజాసంఘాల కార్యాలయం లో  భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సంధర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా అద్యక్ష కార్యదర్శులు ఎండి సుజాయిత్ అలీ, అక్రం మాలిక్ మాట్లాడుతూ కొందరు సాంఘిక సంక్షేమ హాస్టళ్ వార్డెన్లు ప్రైవేటు స్కూళ్లతో కుమ్మకై విద్యార్థుల సంఖ్యను ఏక్కువగా చూపుతున్నారని అన్నారు .
అధికారులు నాయకులు వచ్చినప్పుడు పిల్లలను చూపుతున్నారని తీర రాత్రి వేళ్ళల్లో హాస్టళ్ళను సందర్శించినట్లయితే విధ్యార్థులు ఉండటం లేదని పేర్కోన్నారు . ఇదంతా సంభందిత అధికారులకు తెలిసిన మామూళ్ళ మత్తులో అధికారులు వార్డెన్లకు తొత్తులుగా  వ్యవహరిస్తున్నారని అన్నారు .

విద్యార్థుల బయోమేట్రీక్ విధానం కోద్దీరోజులుగా అందుబాటులో లేక పోవటం వార్డేన్లకు వరంగా మారింది. బయోమేట్రీక్ వేంటనే అందుబాటులో ఉండేలా చూడలని ప్రభుత్వాన్ని కోరారు .

చలి కాలం ద్రుష్ట్యా ప్రభుత్వం పంపిన దుప్పట్లు ఇప్పటివరకూ అధికారుల మోద్దూ నిద్ర వల్ల హాస్టళ్  వార్డెన్లు  విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి సంవత్సరం అధికారులతో కుమ్మకై కొందరు  వార్డెన్లు  హాస్టళ్ మరమ్మతుల పేరిట సంక్షేమ నిధి నుండి డబ్బులు తీసుకోంటున్నారని వాస్తవానికి ఆ డబ్బులు వ్యక్తిగతంగా  వాడుకుంటున్నరాని అరోపిస్తూ కనీసం హాస్టళ్ళలో బాతురూములకు కిటికీలకు డోర్లు లేవని ఫ్యాను కరంటు బల్బులు దుప్పట్లు … ఇతర కనీస వసతులు  వార్డెన్లు  కల్పించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . కనీసం విద్యార్థుల మెను పాటించటం లేదని మరియు స్థానికంగా అందుబాటులో  వార్డెన్లు  ఉండాలని నిభందన ఉన్నా వాస్తవానికి వారనికి ఒక్క సారి వంటసామానులు ఇచ్చి హాస్టళ్ మోకం చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ హాస్టళ్లలో సరిపడ వార్డెన్లు లేకపోవడంతో ఇంచార్జి గా ఉండి సరిగా విధులు నిర్వహించడం లేదని, నిర్లక్షంగా వ్యవహరిస్తున్నవార్డెన్లు  చర్యలు తీసుకోవాలని, తొత్తులుగా  వ్యవహరిస్తూన్న అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండు చేయటమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముల్కల ప్రణీత్, కిరణ్, యాసిన్, శ్రీకాంత్, సహిత్, రామకృష్ణ, మనోహర్, పరశురాం, అజిత్, అక్షయ దీపిక తదితరులు పాల్గోన్నారు.

Please follow and like us:

You may also like...