Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నేషనల్ లోక్ అదాలత్ కు జగిత్యాల జిల్లా పోలీసులు సన్నద్ధం

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్ బ్యూరో:  రాబోయే 23 న జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ కోసం ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీ మురళీధర్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులతో, కోర్ట్ కానిస్టేబుల్  ల తో కలిపి సమావేశం జరిపారు. ఈ నేపధ్యం లో ఈ  మాసం చివరన  జరుగబోనున్న  లోక్ అదాలత్ గురించి  జరిగిన సమావేశంలో చేపట్టవలసిన కార్య సన్నాహక చర్య లపై సమావేశం కొనసాగింది. ఈ లోక్ అదాలత్ లో కంపౌడబుల్ క్రిమినల్ కేసులు మరియు అన్ని సివిల్ కేసులు రాజీ చేయడం జరుగునని తెలిపారు. చివరి సారి లోక్ అదాలత్ లో రాజీ చేసిన కేసులు చేయకుండా, ఉండబడిన కేసుల విషయంలో లోటుపాట్లు అన్ని పరిగణలలోకి తీసుకొని ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యేలా అందరూ తమ తమ కర్తవ్యాన్ని బాధ్యత యుతంగా పరిపూర్ణంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నేషనల్ లోక్ అదాలత్ లో 200 కేసుల పరిష్కారం లక్ష్యం అని, అందరూ లక్ష్యాన్ని చేరేలా నేషనల్ లోక్ అదాలత్ లో సమర్పించవలసిన ఫైళ్లు, సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ని చేరేలా అందరూ తమ తమ సంబందిత పత్రాలు సిద్ధం చేసుకోవాలని లక్ష్యాన్ని చేరేలా ఈరోజు నుండే ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.
ఈ కో-ఆర్డినేషన్ సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ, సి. ఐ లు ప్రకాష్, నాగేందర్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లు, కోర్టు కానిస్టేబుళ్లు హాజరు అయ్యారు.

Please follow and like us:

You may also like...