Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ప్రయివేటు హాస్టళ్ల పై నియంత్రణ కరువు… సుజాయిత్ ఆలీ..?

నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత మారిన ముఖ చిత్రం…పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేట్ హాస్టళ్లు… అధికారులు మొద్దు నిద్రలో ?…నియంత్రణ తో పాటు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 

ఈరోజుటీవి /జగిత్యాల బ్యూరో: ప్రయివేటు పాఠశాలల కు అనుబంధంగా నడుస్తున్న ప్రవేట్ హాస్టళ్ల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సుజాయిత్ అలీ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సుజాయిత్ అలీ మాట్లాడుతూ జిల్లా లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రవేట్ పాఠశాలలకు అనుబంధంగా ప్రేవేట్ హాస్టళ్లను ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా నడుపుతున్నారు.

సరైన వసతులు మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచి నీరు వంటి వాటితో పాటు సరైన వసతులు కల్పించకుండా విద్యార్ధులను చదువుల పేరుతో మానసికంగా, శారీరకంగా   హింసిస్తూ ఒత్తిడికి  గురి చేస్తున్నారని అన్నారు.  మహిళ ల  హాస్టళ్లలో రక్షణ లేకుండా పోతుందని స్పష్టం చేసారు.

విద్య హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా ప్రవేట్ హాస్టళ్లను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. 

విద్య శాఖ అధికారులు ప్రవేట్ పాఠశాల యాజమాన్యం కి వత్తాసు పలుకుతూ చూసిచూడనట్టు గా వ్యవరిస్తున్నారని స్పష్టం చేసారు. ఇది ఇలా ఉండగా తక్షణమే ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్, ప్రణీత్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...