Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవరులారా ఏకమైదాం రండి…షేక్ సలాఉద్దీన్.

మనం ఇప్పడు సంఘటితం కాకుంటే ? ఇక మనం, మన పరిస్థితి అధోగతే ? మన హక్కుల కోసం పోరాటం తప్పదు… రాష్ట్రం లో ఉన్న క్యాబ్ డ్రైవర్లందరూ లింక్ లో మీ మీ వివరాలు నమోదు చేసుకోండి…

డ్రైవర్ లేకపోతె పెద్ద పెద్ద ఇండస్ట్రీ లు లేవు …
డ్రైవర్ లేకపోతె ఎవరికి జీవనఉపాది లేదు …
డ్రైవర్ లేకపోతె సీఎం లేడు పీఎం లేడు …
డ్రైవర్ లేకపోతె ఆఖరికి ఈ సృష్టే లేదు…

ఈరోజుటీవి/హైదరాబాదు బ్యూరో: రాజకీయ నాయకులకు ఎక్కడికయినా పార్లమెంటుకి వెళ్లాలన్న అత్యవసర పరిస్థితిలో ఎక్కడికయినా తీసుకువెళ్లాలంటే డ్రెవర్ అవసరం. ఒక రైతుకి ఎరువులు సప్లె చెయ్యాలన్న రైతు పొలాలు దున్నాలన్న డ్రెవర్ అవసరం. ఒక సామాన్యుడికి నిత్యావసర వస్తువులు సప్లె చెయ్యాలన్న డ్రెవర్ అవసరం. సెలబ్రిటీలను షూటింగులకు టూరులకు ఎక్కడికయినా తీసుకువెళ్లాలన్న డ్రెవర్ అవసరం. ఒక ఆటోనగర్ మొత్తం వాళ్ళ విద్యను నమ్ముకొని బ్రతుకుతున్నారు అంటే మా మోటార్ పీల్డ్ అందులోకూడా డ్రెవర్ హస్తం ముఖ్యం. ఎంతో మంది ప్రయాణికులను సురక్షితంగా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరుకొంటున్నారు అంటే డ్రెవర్ వల్లే అని గుర్తించుకొండి.

డ్రెవర్ వృత్తిని చాల మంది చాల రకాలుగా చిన్న చూపు చూస్తారు. కానీ మా దృష్టిలో ఈ డ్రెవింగ్ అనేది చాల విలువైన విద్య. దేశం అంత తిరిగి అందరికి వాళ్ళ వాళ్ళ సరుకులు అందిస్తాం. డ్రెవర్ జాబ్ ఒక రకంగా సోషల్ సర్వీస్ తోనే లెక్క.

రాత్రి అనగా పగలు అనగా ఎంతో కస్టపడి కంటి మీద కునుకు లేకుండా డ్రెవింగ్ చేస్తూ వాళ్ళు పడే బాధ ఎవరికి తెలీదు.రోడ్లు మీద పోలీస్లకు సమాధానం చెప్పాలి. ఫోన్ లో ఓనర్లుకు సమాధానం చెప్పాలి. లేటు  అయితే  అక్కడ సరుకు తాలూకా పార్టీలకు సమాధానం చెప్పాలి. ఎక్కడైనా ప్రశాంతంగా  ఆపి  పడుకొందామా అంటే అక్కడ దొంగలు ఉంటారేమో అని భయం.

సరే ఏ బంకులోనయేన పెట్టి పడుకొందాము అంటే టైం సరిపోదు. మల్లి తెల్లారుగట్ల బయలుదేరాలి. ఏమని చెప్పను ఎన్నని చెప్పను డ్రెవర్ కష్టాలు. కానీ మేము మా విద్యను హోందగానే పిలవ్వుతాం. ఎవరు చూడని డ్రెవర్ జీవితం గురించి రాయాలంటే ఒక పుస్తకం సరిపోదు.

కొంత మంది అంటుంటారు. అయ్యబాబోయ్ లారీ డ్రెవరా మా అమ్మాయిని లారీ డ్రెవర్ కి ఇవ్వాలా..! వాడు ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగాడో అంటారు. కానీ లారీ మీద డ్రెవర్లు అందరూ ఆలా ఉండరు. అయినా అది లారీ డ్రెవర్ల ఆలోచన విధానాన్ని బట్టి పోతుంది. అయినా లారీ డ్రెవరే కాదు మానిసై పుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆలోచన ప్రకారమే అలవాట్లు వస్తాయి… మంచి ఆలోచిస్తే మంచి అలవాట్లు చెడు ఆలోచిస్తే చెడు అలవాట్లు వస్తాయి…

దానికి ఎవరు ఏమి చేయలేము…!

అది  ఆసరాగా తీసుకోని డ్రెవర్స్ అందరిని ఈ సమాజంలో తప్పుడుగా  చూస్తే ఎలా?

ఆ మాటకి వస్తే లైన్ మీద కన్నా ఊళ్లలోనే ఎక్కువ వ్యభిచారం జరుగుతుంది. మోటార్ పీల్డ్ లో ఇప్పుడు డ్రెవర్స్ బాగానేవున్నారు. బయట వ్యభిచారం చేసే కొంత మంది ఆడవాళ్లు యూత్ నే నాశనం చేస్తున్నారు. ఏమైనా జబ్బులు వస్తే మాత్రం అందరి కన్ను మా మోటార్ పీల్డ్ మా డ్రెవర్ల మీదే పడుతుంది. అసలు దానికి సంబంధించి కారణాలు ఏమిటో ఒక్కరు గ్రహించారు.

కారుల మీద చేసే డ్రెవర్లను కొంత మంది ఓనర్లు కుక్కలా కన్నా హీనంగా చూస్తున్నారు.

మరి ఆ డ్రెవర్లు లేకపోతె వీళ్ళు డ్రెవర్లు అవ్వుతారు అన్న విషయం మరచిపోయారేమో.!

డ్రెవర్లను గౌరవిస్తేనే సొసైటీ లో ఓనర్లకు మంచి విలువ ఉంటుంది. డ్రెవర్ని బాగా చుస్తాడురా అని తోటి డ్రెవర్లు పది మందికి చెప్పుకొంటారు. అలాగే పక్క రాష్ట్రాలకు వెళ్లి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్నారు కొంత మంది లారీ డ్రెవర్లు, వ్యాన్ డ్రెవర్లు, బస్సు డ్రెవర్లు ఎందుకంటే దొంగల భయంతో.ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియని బ్రతుకులు మా డ్రెవర్ల బ్రతుకులు. ఒక పక్కన దొంగలు డబ్బులు దోచేస్తుంటే మరో పక్క పోలీసులు అధికారంతో మరి అన్యాయంగా దోచుకొంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం సార్  అని అడిగితే కేసు రాసి బొక్కలో పెడతాను అని బెదిరింపులు.

ఏ మాత్రం జాలి దయ చూపించరు?
ఇంకా దొంగలకు పోలీసులకు అధికారులకు మధ్య ఒంగిపోయి లొంగిపోయేది మా డ్రెవర్లు మాత్రమే. తరతరాలుగా యూగ యూగలుగా మోటార్ పీల్డ్ కి, ఓనర్లకు, డ్రెవర్లకు ప్రభుత్వాలు ఏదో రూపంలో ఏదో విధంగా వేటు వేస్తున్నారు. టోల్గేట్లు పెంచేశారు, ఆ టాక్స్ ఈ టాక్స్ అని రోడ్డు టాక్సలు పెంచేశారు,అది చాలక అన్నట్లు డీజిల్ రేట్లు పెంచేశారు. ప్రతి దానికి మా మోటార్ పీల్డ్ మీద వేటు వేశారు మా దగ్గర రక్తం అంత మీరే పీల్చేస్తే ఇంకా మా దగ్గర ఏముంటుంది. ఆ ప్రభావం మా జీతాలు మీద కూడా పడింది. ఒక మధ్య తరగతోడు ఒక ఆటో కొనుకొని తిప్పుకొందాం అంటే దేని మీద కేసు రాస్తారో అని భయ్యం…!

లక్షలు పెట్టి లారీలు తీసుకొన్న ఓనరకి భయ్యం
లైన్ మీద ఉన్నా అధికారులు ఎలాంటి రూల్సు పెట్టారా అని కేసులు రాస్తారేమోనని భయ్యం.

నేను ప్రభుత్వాలను అడుగుతున్నాను ..!
మోటార్ పీల్డ్ పట్ల మీ ప్రభుత్వాలు స్రేద్ద చూపించండి. డ్రెవర్లకు మంచి బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలు డ్రెవర్లుని ఆదుకోవాలని కోరుకొంటున్నాను. మోటార్ పీల్డ్ అన్ని రంగాలు కన్నా ప్రత్యేకమైన రంగం ఇది ఒక స్పెషల్.

ఎక్కడెక్కడికో దూరాలు వెళ్తారు ఎంతో మంది మనుషులతో రకరకాల స్వభావం కలిగిన వారి మధ్య ఉంటారు. కాబట్టి లైన్ మీద డ్రెవర్ల సేఫ్టీకి సంబంధించి అన్ని ప్యాకేజీలు ప్రభుత్వాలు అమలు చెయ్యాలి…!

దయచేసి తెలంగాణలో ఉన్న డ్రైవర్ సోదరులు అందరూ సరైన సమాచారం ఇచ్చి సహకరించగలరని, మీ సమాచారాన్ని ఈ క్రింది ఫారంలో నమోదు చెయ్యగలరని తెలంగాణ ఫోర్ వీలర్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాఉద్దీన్ కోరుతున్నారు. 
https://goo.gl/forms/x5SsAeuFVek6G7s32

నా తోటి అన్నదమ్ములు, మిత్రులు రండి మీరు కూడా మన తెలంగాణ షోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ లో ఒక్క భాధ్యత గల సభ్యులు గా మన వంతు ప్రయత్నం చేద్దాం.

మన నుంచి ఎంత మేలైతే అంత మేలు చేకూర్చుద్దాం. చేతిలో చేయి వేసి, అడుగులో అడుగు వేసి, గొంతుతో గొంతు కలిపి మన మందరం కలిసి మెలిసి మన అశయాలను, మన లక్ష్యాలను సాద్దిద్దాం అని ఈ సందర్బంగా వారు కోరారు.

Please follow and like us:

You may also like...