ఆలేరు నా ప్రాణంతో సమానం..బూడిద భిక్షమయ్య గౌడ్…

ఆలేరు : ఎన్నికల్లో ఓటమి ప్తె కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి ఆలేరు లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటమి పాల్తెన ఆలేరు అభ్యర్థి బూడిద బిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ, ఆలేరు ప్రాంతం నా ప్రాణాంతో సమానమని, ప్రజా క్షేత్రం లో గెలుపు ఓటములు సహజమని, అయితే మనం ఎక్కడ్తె తే మనది అనుకున్నది పోగొట్టుకున్నమో అక్కడే తిరిగి నిలబెట్టు కునేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ నా కంఠంలో ప్రాణం వున్నంత వరకు కార్యకర్తలకు అండగా వుంటానని, ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని బిక్షమయ్య గౌడ్ అన్నారు. ఈవీఎం లు టంపరింగ్ అయ్యాయని సమీక్ష జరుగుతుందని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.