Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఈవీఎం లపై వస్తున్న అనుమానాలకు ప్రత్యేక సాంకేతిక, ప్రజా కమిటీ వేసి నిజాల్ని ప్రజలకు ఎన్నికల కమిషన్ తెలపాలంటున్న రాజకీయ పక్షాలు?

ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య భారతావని గొప్పదనాన్ని చాటుకోవాలి

తెరాస పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధం గా ఈ ఎన్నికల్లో వ్యవహరించిందని రాజకీయ పక్షాల ఆరోపణ 

ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ/ ప్రజల డబ్బుతోనే ప్రజల ఆయుధాన్ని(ఓటు) కొన్నదని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం తో పాటు రాజకీయ పక్షాలు 

ప్రజాస్వామ్యం లో మన రక్షణ కోసం ఉన్న ఆయుధం ఓటు కానీ, కేసీఆర్ తెలివిగా పథకాల ఎర చూపి మన డబ్బుతోనే మన ఆయుధాన్ని కొని ఇప్పుడు మనల్నే బెదిరించడం ఖాయమని విమర్శిస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఈ ఎన్నికల్లో కేసీఆర్ విలువలు లేని రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని, ప్రజల్ని అధోగతి పాలు చేసాడని ఆరోపిస్తున్నారు.

డబ్బు, మద్యం, సాంకేతికత, ప్రజల తాత్కాలిక అవసరాలు,అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తెరాస అధినేత అధికారంలోకి రాగలిగాడని దుయ్యబడుతున్నారు.
అసలు ఈవీఎం ల పైనే అనుమానాలు కలిగే విధంగా 31 స్థానాల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు వ్యత్యాసాలు రావడం చూస్తే ఇక్కడే మోసం జరిగినట్టు భావించాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు.

ఈవీఎం లపై ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తమవుతున్నయన్న వారు గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లోనే వీటిపై చర్చ జరగడం తదనంతరం ఖచ్చితంగా పోరాడకపోవడం తో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు తెరాస సాహసించింది అనే వాదన బలంగా వినిపిస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎన్ని ఫిర్యాదు లు చేసినా ఎన్నికల కమీషన్ స్పందించక పోవడం వెనుక గల కారణాలు ఏలినవారికే తెలియాలని అంటున్నారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనది. కానీ, లక్షల ఓట్లు గల్లంతైన వాస్తవాన్ని ఆధారాలతో చూపినా కూడా ఎన్నికల కమిషన్ నామమాత్రంగా స్పందించిన తీరు మరియు ఈవీఎం ప్రోగ్రామింగ్ మనేజ్మెంట్ పై వస్తున్న ఆరోపణలపై ఎన్నికల కమీషన్ స్పందించి స్వచ్చందంగా సాంకేతిక విజిలెన్స్ కమీటీ ని ఏర్పాటు చేసి అన్నీ రాజకీయ పార్టీల వారిని, స్వచ్ఛంద సంస్థలను, ఇతర సాంకేతిక సంస్థల ను ఆహ్వానించి ఈవీఎం ల పనితనాన్ని, ఎన్నికల కమిషన్ నైతికత ను నిరూపించుకోవడం వల్ల ప్రజాస్వామ్య భారతావని గొప్పదనం భారతీయులకే కాదు, ప్రపంచ దేశాలకు తెలుస్తుందని గుర్తు చేస్తూనే, అలా గనుక చేయడం లో విఫలమైతే ప్రజాస్వామ్యం అపహాస్యం జరిగినట్టే అని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నారు. 

Please follow and like us:

You may also like...