Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తెలంగాణలో ఎన్నికల నిర్వహణ అన్నీ తప్పుల తడకలే

పోలైన ఓట్ల కన్నా కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లే అధికం

సీఈసీ వెబ్‌సైట్ వెల్లడించిన పచ్చి నిజాలు

 రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై అనేక అనుమానాలు

ఎన్నికల కమిషన్ టీఆర్‌ఎస్‌తో కలిసి ఆడిన డ్రామా

తక్షణం రీపోలింగ్ జరిపించాలి

కాంగ్రెస్ పార్టీ డిమాండ్…

రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ తీరు తప్పుల తడకగా జరిగిందని, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని వస్తున్న విమర్శలకు అవుననే సమాధానం స్పష్టంగా వినిపిస్తోంది.

ఎన్నికలలో పోలైన ఓట్లకు, పోటీ చేసే అభ్యర్థులకు లభించిన ఓట్లకు పొంతన లేకుండా ఉంది. పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం 31 నియోజకవర్గాలలో కనిపిస్తుండడం, అదేవిధంగా లెక్కించిన ఓట్లకు అభ్యర్థులకు వచ్చిన మెజార్టీకి మధ్య వ్యత్యాసం ఉండడం, ఈ వ్యత్యాసం ఉన్న అన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

శాసనసభ పోలింగ్ ముగిసే సమయానికి నాలుగైదు గంటల వ్యవధిలోనే పోలైన ఓట్ల శాతం ఎన్నికల కమిషన్ విడుదల చేయాల్సి ఉండగా ఈ దఫా 48 గంటలు సమయం తీసుకోవడం కూడా ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

శాసనసభ రద్దు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్రమైన విమర్శలు, నిరసనలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారి కార్యాలయం చివరికి కౌంటింగ్ ముగిసే దాకా ఇదే విధమైన విమర్శలను ఎదుర్కోవడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని పలువురు విమర్శిస్తున్నారు.

పోలింగ్ జరిగిన డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల గల్లంతుపై అనేక విమర్శలు చెలరేగగా చివరికి ఎన్నికల ముఖ్య అధికారి క్షమాపణ చెప్పి ఆ అంశానికి ముగింపు పలికారని అయితే ఓట్ల గల్లంతుపై ఎన్ని విమర్శలు ఎదురైనా చక్కదిద్దే ప్రయత్నం కూడా చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

అనేక నియోజకవర్గాలలో భారీ పోలింగ్ జరిగిందని పట్టణ ప్రాంతాలలో తక్కువ పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం పేర్కొంటున్నప్పటికీ అసలు ఎంత పోలైంది అన్నది సకాలంలో ప్రకటించకపోవడానికి హేతుబద్ధతమైన కారణాన్ని ఎన్నికల సంఘం వివరించలే కపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

జిల్లాల్లో అనుభవం లేని అధికారులు ఎన్నికల విధులు నిర్వహిచడం, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్న లిఖిత పూర్వక ఫిర్యాదులపై కూడాఎన్నికల సంఘం సరిగా స్పందించలేదని పలువురు విమర్శిస్తున్నారు.

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లకు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ఓట్లకు వ్యత్యాసం ఉండడం ఒక విశేషం అయితే అనేక నియోజకవర్గాలలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన పోలింగ్ శాతానికి అనుగుణంగా పోలైన ఓట్లలో వ్యత్యాసం ఉండడం మరో విశేషం.

పోలైన ఓట్ల కన్నా కౌంటింగ్‌లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉండడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

పోలింగ్ తేదీన పడిన ఓట్లకూ, లెక్కింపునాడు తేలిన ఓట్ల మధ్య వ్యత్యాసం

రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో 7వ తేదీ పోలింగ్ ముగిసే సమయానికి అధికారికంగా ప్రకటించిన పోలైన ఓట్లకు, 11వ తేదీన కౌంటింగ్‌లో వివిధ రాజకీయ పక్షాల తరుపున పోటీ చేసిన అభ్యర్థులకు లభించిన ఓట్లకు చాలా వ్యత్యాసం కనబడుతోంది.

కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి అధికారికంగా లభించిన సమాచారం ప్రకారం 31 నియోజకవర్గాలలో 1,026 ఓట్ల నుంచి 4,743 ఓట్ల వరకూ అధికంగా పోలైన ఓట్లు పేర్కొనడం విశేషం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం 1,35,654 ఓట్లు పోలవ్వగా కౌంటింగ్ జరిగిన రోజు 1,40,397 ఓట్లుగా పేర్కొన్నారు.

అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో 1,82,438 ఓట్లు పోలవ్వగా కౌంటింగ్‌లో 1,85,618 ఓట్లు నమోదై పోలింగ్ కన్నా 3,180 ఓట్లు అధికంగా రావడం మిస్టరీగా మిగులుతోంది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి లభించిన 31 నియోజకవర్గాలలో ఈ విధమైన తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన పోలైన ఓట్లలో ఈ విధమైన వ్యత్యాసం ఉండడం, పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో బయటపడిన ఓట్లు అధికంగా ఉండడం వంటి విషయాలను పరిశీలిస్తే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తు న్నారు.

సంక్షేమ పథకాల వల్లే తిరిగి అధికారం పొందామని ప్రకటిస్తున్న నేపథ్యంలో అదే సంక్షేమ పథకాలు అమలై, కోట్లాది రూపాయల వ్యయంతో నీటిపారుదల ప్రాజెక్టులు అమలు చేసిన ఖమ్మం జిల్లాలో పదిస్థానాలకు 8 స్థానాలు అధికార పార్టీ కోల్పోవడంపై కూడా పలు విమర్శలకు తావిస్తోంది.

అదేవిధం గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1,95,963 ఓట్లు పోలైనట్లు అధికారికంగా పేర్కొంటుంటే 11వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో 888 ఓట్లు అధికారికంగా లెక్కించారని, ఇక్కడ గెలిచిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి కేవలం 376 ఓట్లు మాత్రమే ఆధిక్యత రావ డం విశేషం.

అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గంలో 441 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించగా పోలైన ఓట్ల కంటే 469 ఓట్లు కౌంటింగ్‌లో అధికంగా రావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

కోదాడ నియోజకవర్గంలో 756 ఓట్లు ఆధిక్యం తో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపోందగా అక్కడ పోలైన ఓట్లకు కౌంటింగ్‌లో వివిధ అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు తేడా 1682 మాత్రమే ఉండగా తుంగతుర్తి నియోజకవర్గంలో పోలింగ్ నాడు నమోదైన ఓట్లకు కౌంటింగ్ లో అభ్యర్థులకు లభించిన ఓట్లకు 813 ఓట్లు తేడా ఉండగా అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి 1847 ఓట్ల ఆధిక్యతతో గెలవడం విశేషం.

రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై పిటిషన్ వేస్తాం: మర్రి శశిధర్ రెడ్డి

ఎన్నికల సంఘం పనితీరుపై తొలినుంచి ఆరోపణలు వస్తున్నాయని, అనేక లోపాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా సరిగా స్పందించ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఈ అవకతవకలపై ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నామని, త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నో లోపాలకు కారణమైన ఎన్నికల కమిషన్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికలు రద్దు చేయాలి : దాసోజు శ్రవణ్

టీఆర్‌ఎస్ పార్టీని దొడ్డి దారిన అధికారంలోకి తేవడానికి ఎన్నికల కమిషన్ కుట్రపూరితంగా వ్యవహరిం చిందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో వ్యత్యాసం వచ్చిన నియోజకవర్గాలలో తక్షణం ఎన్నికలు రద్దు చేసితిరిగి ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు హేయమని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు ఒక డ్రామాను తలపించిందని స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహిచండంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు – 2018

క్ర.సం. నియోజకవర్గం డిసెంబర్7న డిసెంబర్ 11న తేడా మెజారిటీ గెలిచిన పార్టీ

పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు

1. ఇబ్రహీంపట్నం 195963 196851 888 376 టీఆర్‌ఎస్

2. ధర్మపురి 165278 165747 469 441 టీఆర్‌ఎస్

3. కోదాడ 192206 193888 1682 756 టీఆర్‌ఎస్

4. సూర్యాపేట 181662 183832 2170 5967 టీఆర్‌ఎస్

5. ఖమ్మం 202717 206428 3711 10991 టీఆర్‌ఎస్

6. తుంగతుర్తి 199009 199822 813 1847 టీఆర్‌ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు – 2018

వరుస నియోజకవర్గం డిసెంబర్ 7న డిసెంబర్ 11న తేడా గెలిచిన

సంఖ్య       పోలైన ఓట్లు   లెక్కించిన ఓట్లు    పార్టీ

1. ఆర్మూర్ 135654    140397   4743   టీఆర్‌ఎస్

2. ముషీరాబాద్ 140715 144694 3979 టీఆర్‌ఎస్

౩. కరీంనగర్ 195714 198926 3212 టీఆర్‌ఎస్

4. నల్గొండ 182438 185618 3180 టీఆర్‌ఎస్

5. అచ్చంపేట్ 173502 176239 2737 టీఆర్‌ఎస్

6. మహబూబ్‌నగర్ 157330 159661 2331 టీఆర్‌ఎస్

7. నిజామాబాద్ (రూరల్) 172317 174621 2304 టీఆర్‌ఎస్

8. వరంగల్ వెస్ట్ 140438 142664 2226 టీఆర్‌ఎస్

9. ముథోల్ 181773 183963 2190 టీఆర్‌ఎస్

1౦. గద్వాల్ 189037 191192 2155 టీఆర్‌ఎస్

11. నిజామాబాద్ (అర్బన్) 149512 151279 1767 టీఆర్‌ఎస్

12. హుస్నాబాద్ 185014 186819 1805 టీఆర్‌ఎస్

1౩. సిద్దిపేట్ 165425 167055 1630 టీఆర్‌ఎస్

14. మిర్యాలగూడ 177415 179037 1622 టీఆర్‌ఎస్

15. నాగర్‌కర్నూల్ 166980 168581 1601 టీఆర్‌ఎస్

16. మేడ్చల్ 302921 304361 1440 టీఆర్‌ఎస్

17. అందోల్ 197429 198849 1420 టీఆర్‌ఎస్

18. ఆదిలాబాద్ 164416 165793 1377 టీఆర్‌ఎస్

19. మహబూబాబాద్ 183625 184940 1315 టీఆర్‌ఎస్

20. జనగామ 180183 181468 1285 టీఆర్‌ఎస్

21. వరంగల్ ఈస్ట్ 154325 155577 1252 టీఆర్‌ఎస్

22. వర్ధన్నపేట 188022 189269 1247 టీఆర్‌ఎస్

23. కామారెడ్డి 161003 162228 1225 టీఆర్‌ఎస్

24. పాలకుర్తి 197375 198519 1144 టీఆర్‌ఎస్

25. దేవరకద్ర 173288 174410 1122 టీఆర్‌ఎస్

26. నిర్మల్ 171964 173084 1120 టీఆర్‌ఎస్

27. జగిత్యాల 158606 159720 1114 టీఆర్‌ఎస్

28. కొడంగల్ 164460 165559 1099 టీఆర్‌ఎస్

29. కుత్బుల్లాపూర్ 288275 289368 1093 టీఆర్‌ఎస్

౩౦. పటాన్‌చెరు 213032 214065 1033 టీఆర్‌ఎస్

౩1. జహీరాబాద్ 187873 188899 1026 టీఆర్‌ఎస్

Please follow and like us:

You may also like...