Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

స్వామి వారికి పుష్పోత్సవము

కర్నూలు జిల్లా…
మహానంది దేవస్థానం..
ఈరోజు టీవీ న్యూస్:
మహానంది దేవస్థానంలో
మార్గశిర శుద్ధ ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా 18 తేదీన మహానంది క్షేత్రం లో వెలసిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత కోదండరామస్వామి వారికీ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, పుష్పోత్సవములు , శ్రీ రామ హవనములు ఆలయకార్యనిర్వహణాధికారి యన్ సి. సుబ్రహ్మణ్యం, ఛైర్మన్ పాణ్యం ప్రసాదరావు ఆధ్వర్యంలో నంద్యాల భారతి సీడ్స్ అధినేతలైన శ్రీమతి మరియు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి, రామపుల్లమ్మ గార్ల సహకారంతో నశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతున్నది ఆలయ వేదపండితులు రవిశంకర్ అవధాని గారు తెలిపారు.
రవిశంకర్ అవధాని మాట్లాడుతూ యావన్మంది భక్తాదులు అశేషంగా తరలివచ్చి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, పుష్పోత్సవ దర్శనము చేసుకొని భగవదనుగ్రహమును పొందగలరని తెలిపారు.

తెల్లవారుజాము 4 గంటల నుండి కోదండరామ స్వామి వారు హనుమద్వాహనము పై ఉత్తర ద్వారంలో వేంచేయుట అక్కడ విశేష ధనుర్మాస పూజ, తిరుప్పావై సేవలు అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగును. ఉదయం 8-30ల నుండి పుష్పోత్సవము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.

Please follow and like us:

You may also like...