Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

అమరజీవికి ఘన నివాళులు

ఒంగోలు: కీర్తి శేషులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 66వ వర్ధంతి సందర్భముగ నేడు 15 శనివారం డిశంబరు ఉదయం 9 గంటలకు ఒంగోలు లోని తాత బిల్డింగు వద్దగల శ్రీరాముల వారి విగ్రహమునకు పూలమాలాంకృతం చేసిన ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్స్ ఒంగోలు విభాగం ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు అధ్యక్షులు తుమ్మపూడి బుచ్చిబాబు, కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, గవర్నరు గార్లపాటి బ్రహ్మానందం, ఆలిండియా మహాత్మా క్లబ్స్ ఉపాధ్యక్షులు రాధా రమణ గుప్తా గౌరవ అతిధులు జిల్లా కనకయ్య గారు, ఆరె మరాఠా సంఘ గౌరవ అధ్యక్షులు దయిండే ప్రభాకర్ గారు మరియు సభ్యులు మద్దాలి సురేష్, బొమ్మిశెట్టి కౌశిక్,తుమ్మపూడి ఏడుకొండలు, వేమూరి సాయి(బంగారం), వక్కలగడ్డ నారాయణ మూర్తి, వక్కలగడ్డ పద్మజ, అప్పల మాధవి, మద్దాల పద్మప్రియ శిఖాకొల్లి మోహన్ రావు తదితరులు పాల్గొని శ్రీరాముల వారికి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భముగ ముఖ్య అతిధులు కనకయ్య, ప్రభాకర్ గార్లు మాట్లాడుచూ శ్రీరాములవారు 56 రోజుల పాటు అన్నపానీయాలు మానివేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆత్మ బలిదానము వలెనే తెలుగు మాట్లాడు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, ఆ మహనీయుని జయంతి వర్ధంతిని నేడు రెండుగ ఏర్పడిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించడంలేదని, భవిష్యత్తు తరాలు వారిని గుర్తుంచుకొనే విధముగ స్వచ్ఛందసంస్థ గ నేడు ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యములో నివాళులు అర్పించు కార్యక్రమము నిర్వహించడం ముదావహమని, మహనీయులను భావి తరానికి పరిచయం చేయడం గొప్ప అదృష్టమని తెలిపారు. పొట్టి శ్రీరాముల వారిని స్మరించుకోవడం వారికి నివాళి అర్పించడం వారిపై మనకు ఉన్న గౌరవము, భక్తిని తెలుపడమేనని ఆలిండియా ఉపాధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు.

విచ్చేసిన సభ్యులందరూ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములని నివాళులు అర్పించినారు.

Please follow and like us:

You may also like...