Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

డివిజను స్థాయి ఆటల పోటీలు

కర్నూలు జిల్లా…
మహానంది/తిమ్మాపురం..
ఈరోజు టీవీ న్యూస్:
శ్రీ కాళికంబ హనుమాన్ వ్యాయామ పాఠశాల నంద్యాల వారు గురురాజ ఇంగ్లీషు మీడియం స్కూల్లో నంద్యాల డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.ఇందులో తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీనియర్ ,జూనియర్ విభాగంలో రెండు దాంట్లో విజేతలుగా నిలిచారు. వీరికి శనివారం ఉదయం తిమ్మాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికీ ముఖ్య అతిథిగా మహానంది తహశీల్దార్ సుబ్బారాయుడు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులు ను అభినందించారు. బెస్ట్ రైడర్ భాస్కర్ కు సైకిల్ అందజేశారు.కబడ్డీ ఆటల్లో మంచి ఆటతీరును కనబరిచి జట్టు విజయం లో ముఖ్య పాత్రను పోషించిన క్రీడాకారులు దూదేకుల సాయి, రియాజ్, మనోజ్, భాస్కర్ ను మహానంది తహశీల్దార్ సుబ్బారాయుడు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు. ఆటలు ఆడటానికి కృషి చేసి సొంతంగా ఎంట్రీ ఫీజ్ కట్టిన మాజీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ దూదేకుల మురళీ నీ ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ బ్ల్యూ స్ ఏఈ మురళికృష్ణ నాయక్, బుక్కాపురం పంచాయతీ కార్యదర్శి రేణుకా,నాగరాజు,పాఠశాల ఇంచార్జి ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,వ్యాయామ ఉపాద్యాయులు వీర రాఘవయ్య,ఉపాధ్యాయులు సుబ్బారాయుడు, సోమన్న,అబూలైస్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...