Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆర్.యు.పి.పి.టి. ప్రాతినిధ్యం మేరకు ఒపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ.

రాయికల్: జిల్లాలో రాష్ట్రం లో చాలామంది విద్యార్థులు అనివార్య, విపత్కర కారణాల వలన గడువు వున్న సమయంలో మారుమూల ప్రాంతాల ఔత్సాహిక విద్యార్థులు అడ్మీషన్స్ పొందలేక పోయారని, అలాగే అటెండెన్స్ తక్కువ ఉందనే తదితర అనేక కారణాల వలన రెగ్యూలర్ విద్యార్థులు కొందరు రెగ్యూలర్ పరీక్ష ఫీజులు చెల్లించలేక పోయారని, వీరు సంవత్సరం వేనుకబడిపోయే ప్రమాదం వున్నదున గడువు పొడిగించి విద్యార్థులు ఒక సంవత్సరం వెనుకపడిపోకుండా న్యాయం చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్.యు.పి.పి.టి) జగిత్యాల జిల్లా శాఖ పక్షాణ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ రాష్ట్ర ఒపెన్ స్కూల్ డైరెక్టర్ కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు చేసిన మేయిల్, ఫోన్ కాల్ ప్రాతినిధ్యం మేరకు ఈ నెల 15 నుండి 29 వరకు లేట్ ఫీతో అడ్మీషన్ గడువు పొడిగిస్తూ నోటిఫీకేషన్ జారీ అయినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు జిల్లా, మండల కేంద్రాలలో గల ఒపెన్ స్కూల్ స్టడీ సెంటర్ లలో అడ్మీషన్ పొంది ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఒపెన్ స్కూల్ డైరెక్టర్ కు ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ పక్షాణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు మరిన్ని వివరాలకు 9440514518, 9440236817 లలో సంప్రదించాలని పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు.

Please follow and like us:

You may also like...