Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పది నియోజకవర్గాల్లో రిపోలింగ్ ఈసీ?

జనవరి 5వ తేదీన ఎన్నికలు 8వ తేదిన ఫలితాలు వెల్లడీ?

తెలంగాణ లో మళ్ళీ ఎన్నికలు పెట్టనున్న నియోజకవర్గాలు అవి ఇవి(కొదాడ, కల్వకుర్తి , కోడంగల్,నలగొండ ,ధర్మపురి, ఇబ్రాహీంపట్నం, కామారెడ్డి , అంబర్ పేట) ఓట్లు 470 ఎక్కువ రావడం గమనార్హం. నిజానికి, కొడంగల్‌ నియోజకవర్గంలో మొత్తం 264 బూత్‌లు ఉన్నాయి. వాటిలో 89వ నంబరు బూత్‌లో 780 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌లో మాత్రం 909 ఓట్లు నమోదయ్యాయి. అంటే, 129 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 74వ నంబరు పోలింగ్‌ బూత్‌లో 666 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌లో మాత్రం 636 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అంటే, పోలైన ఓట్ల కంటే 30 ఓట్లు తక్కువ వచ్చాయి.

ఒక్క కొడంగల్‌ నియోజకవర్గంలోని 264 బూత్‌ల్లో.. 24 పోలింగ్‌ కేంద్రాల్లో 711 ఓట్లు అదనంగా నమోదైతే.. 17 కేంద్రాల్లో 233 ఓట్లు తక్కువ వచ్చాయి. మొత్తంమీద, 41 బూత్‌ల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా వచ్చింది. ఈ తేడా కూడా 478 ఓట్లు అని ఎన్నికల సంఘమే నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఈసీ పనితీరుపై తీవ్రస్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తప్పుల తడక నివేదికలే అందుకు నిదర్శనమనే ఆరోపణలు వస్తున్నాయి. పోలైన ఓట్ల కంటే తక్కువగా కౌంటింగ్‌లో ఎందుకు వచ్చాయో ఈసీ సమాధానం చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. కారుకు బ్రెక్ పడే అవకాశాలు లేకపోలేవు, ఇబ్రహింపట్నంలో మళ్ళీ రిపోలింగ్ స్పష్టం చేసిన హైకోర్టు…

Please follow and like us:

You may also like...