మహానంది చేరిన మహా భారీ రాతి నందీశ్వరుడు.
గుంటూరు కు చెందిన దాత రాజేంద్రప్రసాద్ నంది విగ్రహానికి సుమారు 35 లక్షల సహకారం…
కర్నూలు జిల్లా…
మహానంది దేవస్థానం..
ఈరోజు టీవీ న్యూస్:
మహానంది కీ చేరుకున్న భారీ రాతి నందీశ్వరుడు.
ఈరోజు ఉదయం నంద్యాల పొలిమేరలో (అయ్యలూరు మెట్ట వద్ద ) భారీ నంది విగ్రహానికి దేవస్థానం ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా స్వాగత పూర్వక ఉపచార పూజలు నిర్వహించిన అనంతరం నూనేపల్లి బ్రిడ్జ్ నుండి పట్టణంలో ప్రవేశించి సాయిబాబా నగర్, టెక్కె మీదుగా వచ్చి పద్మావతి నగర్ ఆర్చి గేటు నుంచి నవనందులలో ఆద్యుడైన ప్రథమ నందీశ్వరాలయంలో పూజలు స్వీకరించి సంజీవనగర్, శ్రీనివాస సెంటర్, ఆత్మకూరు బస్టాండు నుంచి చెరువుకట్ట మార్గంలో మహానంది క్షేత్రం చేరినది. మహానంది లో ఈఓ యన్ సి.సుబ్రహ్మణ్యం, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు చేత పూజాదికములు వేదపండితులు రవిశంకర్ అవధాని మరియు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించడమైనది. దారిలొ భక్తులు నారికేళ, కూష్మాండబలిహరణలు చేసినారు. భారీ రాతి నంది విగ్రహాన్ని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నంది రాకతో మహానంది మహానందంగా భక్తులను ఆకట్టుకుంటుంది.
దాత సహకారంతో మహానందంగా రాతి నంది విగ్రహం ను తయారు చేశారు.
గుంటూరు కు చెందిన రాజేంద్రప్రసాద్ ఈ రాతి నంది విగ్రహాన్ని సుమారు 35 లక్షల వ్యయం తో తయారు చేయించారు. తిరుపతి కి సమీపంలోని కరకంబాడి బొమ్మలకొలువు కాలనీకి చెందిన శిల్పి ప్రసాద్ 50 టన్నుల కంచి రాయి తో అతి సుందరంగా తీర్చిదిద్దారు.