Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఈసీ మాయాజాలానికి ఇది ఒక ఉదాహరణ ?

వికారాబాద్: అక్కడ పోలైన ఓట్ల కంటే ఈవీఎంలో 37 ఓట్లు అధికంగా నమోదవడం ఒక ఎత్తైతే.. మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో వీవీ ప్యాట్‌లోని స్లిప్పులను లెక్కించగా 14ఓట్లు తక్కువగా ఉండడం ఇక్కడ మరో ఎత్తు. వికారాబాద్‌ సెగ్మెంట్‌ పరిధిలోని రుద్రారం పోలింగ్‌ బూత్‌లో విచిత్ర పరిస్థితి ఇది. ఇక్కడ ఓట్ల లెక్క అధికారులకు అంతు చిక్కడం లేదు. రుద్రారం గ్రామానికి చెందిన 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో 566 ఓట్లు ఉండగా 518 ఓట్లు పోలయ్యాయి. అయితే అదే రోజు పోలింగ్‌ ఏజెంట్లకు చూపించే క్రమంలో ఈవీఎంలో 555 ఓట్లు పోలైనట్లు కనిపించింది. దీనిపై ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ జిల్లా కలెక్టర్‌కు అదే రోజు ఫిర్యాదు చేశారు. దీంతో కౌంటింగ్‌ రోజున సదరు ఈవీఎంను పక్కనబెట్టి వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించగా.. 504 ఓట్లు మాత్రమే పోలైనట్లు తేలింది. దీనిపై అధికారులు సమాధానం చెప్పకపోవటంతో కాంగ్రెస్‌ నేత శశాంక్‌రెడ్డి, టీడీపీ ఏజెంట్‌ మహ్మద్‌ బాబాఖాన్‌ మరోసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి పంపించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Please follow and like us:

You may also like...