2019 నాటికి పోలవరం పూర్తిచేస్తాం….

చంద్రబాబు 2019 నాటికి పోలవరం పూర్తిచేస్తాం….


పోలవరం: పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత రావడం తన అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు పోలవరం గ్యాలరీని ప్రారంభించిన ఆయన కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి అందులో నడిచారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఐదుకోట్ల ప్రజల కలల జలసౌధం పోలవరమని అన్నారు. ఈ ప్రాజెక్టు దక్షిణాంధ్రకు నవజీవనం, నవ్యాంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని పేర్కొన్నారు.

‘కేంద్ర సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. 2019లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావెటీ ద్వారా నీరిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. పోలవరం కుడి కాల్వ 90శాతం, ఎడమకాల్వ 63శాతం పూర్తయింది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని 27సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు పరుగులు పెట్టించాం. పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టాలన్నీ రికార్డులు సృష్టించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టుగా పోలవరం నిలవనుంది.

పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే ఏపీ ప్రభుత్వానికే అప్పగించాలని అప్పట్లో నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేశారు. అందువల్లే ఈ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించింది. ఈ విషయంలో నాపై కొందరు విమర్శలు చేయడం బాధ కలిగించింది.

పోలవరం ప్రాజెక్టుకు అవరోధాలు కలిగించేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. పట్టిసీమ విషయంలోనూ నాతో కొందరు సవాళ్లు చేశారు. వారి సవాళ్లను స్వీకరించి 10 నెలల్లోనే పట్టిసీమ ఎత్తిపోతలను పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టుపై అప్పట్లో ప్రశంసలు కురిపించిన భాజపా నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది’ అని అన్నారు.

Please follow and like us:

You may also like...