సుంకులపరమేశ్వరి అమ్మ వారి దేవాలయంకు విరాళం….

ఎమ్మిగనూరు : నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కె ఆర్.మురహరిరెడ్డి పట్టణంలోని సుంకులపరమేశ్వరి దేవలయం షెడ్డు నిర్మాణంకు 65000 వేల రూపాయలు అమ్మవారి దేవాలయం అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం అందించారు .దేవాలయం కమిటీ మెంబర్ పాండు రంగ మాట్లాడుతూ తన తండ్రి కెఆర్.గౌడరెడ్డి వారు అప్పటిలోనే సేవాగుణం కలిగిన వారని ఎందరో పేదలకు తన వంతు సహాయం చేసే వారని తండ్రి బాటలోనే కెఆర్.మురహరిరెడ్డి కూడా దేవాలయాలకు,పెదప్రజలకు,పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,ప్లేట్స్ కెఆర్.గౌడరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరుపున పేద ప్రజలకు ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టాని అధికార పార్టీ నాయకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేని విదంగా చేపడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వారికి అధికారం చేపడితే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆశ భావం వ్యక్తం చేశారు. షేడ్ నిర్మాణానికి సహకరించిన కెఆర్ మురహరిరెడ్డి కి సుంకులపరమేశ్వరి దేవాలయం కమిటీ మెంబర్స్ ఆయనకు ధన్యవాదములు తెలుపుతూ శాలువా కప్పి సన్మానించారు.

Please follow and like us:

You may also like...