సీఎం హత్యకు మయన్మార్ డ్రగ్స్ మాఫియా కుట్ర…!

‘నిషా ముక్త్ త్రిపుర’ ఏ కారణమా?

న్యూఢిల్లీ/త్రిపుర  : త్రిపుర రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఆట కట్టించారనే కోపంతో సాక్షాత్తూ త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్ నే హత్య చేసేందుకు మయన్మార్ డ్రగ్స్ మాఫియా కుట్ర పన్నిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమాచారం అందింది. దీంతో సీఎం విప్లవ్‌దేవ్ భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేయడంతోపాటు అతన్ని ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరించింది. త్రిపుర రాష్ట్ర ఎన్నికల్లో ‘నిషా ముక్త్ త్రిపుర’ పేరిట ప్రచార నినాదంతో అధికారంలోకి వచ్చిన విప్లవ్ దేవ్ పోలీసులతో దాడులు చేయించి 50వేల కిలోల కన్నాబీస్, హెరాయిన్, బ్రౌన్ షుగర్లను స్వాధీనం చేసుకొని 120 డ్రగ్స్ మాఫియా సభ్యులను అరెస్టు చేయించారని త్రిపుర బీజేపీ నాయకుడు రతన్ చక్రవర్తి చెప్పారు.

డ్రగ్స్ స్వాధీనం, అరెస్టులతో బెంబేలెత్తిన మయన్మార్ డ్రగ్స్ మాఫియా సీఎం విప్లవ్ దేవ్ నే హత్య చేసేందుకు కుట్ర పన్నిందని చక్రవర్తి చెప్పారు. ఈ మేరకు తమకు కేంద్రహోంమంత్రిత్వశాఖ రాజ్‌నాథ్‌సింగ్ నుంచి సమాచారం అందిందని రతన్ చక్రవర్తి పేర్కొన్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి రూ,.1500 కోట్ల డ్రగ్స్ త్రిపురలోకి వస్తున్నాయని చక్రవర్తి ఆరోపించారు.

Please follow and like us:

You may also like...