సామాన్య ప్రజల సూటి ప్రశ్నలు….!

నిన్నటి నిజామాబాద్ మీటింగ్ లో మాట్లాడిన కే.సి.ర్. గారిని ప్రజలు ఈ క్రింది పది ప్రశ్నలు అడుగుతున్నారు…!

 • మీరు గతంలో పెట్టుకున్న పొత్తుల గురించి అప్పుడు ఏమి ఆశించి వారితో పొత్తులు పెట్టుకున్నారు అవి ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి..?
 • మీరు తెలంగాణ అభివృద్ధి కోసం పబ్లిక్ మీటింగ్ లలో ఆంధ్రవాళ్ళని తిడుతున్నారు సంతోషం తెరవెనుక వారితో మీ స్నేహం ఏంటి…?
 • ఏబీఎన్ రాధా క్రిష్ణని, రామోజీ రావు ని, చంద్రబాబు ని విమర్శిస్తూ తెలంగాణ లో వారి ఆస్తులను కాపాడే ప్రయత్నం చేయడం లేదా!
 • చిన్న ఉదాహరణ లు ఆంధ్రజ్యోతి కార్యాలయం కాలినపుడు మీ కుటుంబం అందరు వెళ్ళి వారికీ భరోసా ఇవ్వలేద ? హరికిష్ణకు స్మారక స్థూపం, ప్రకటించ లేదా? రామోజీ ఫిల్మ్ సిటీ వంద నాగళ్లు ఏమైనట్టు…?
 • తెలంగాణాలో చేపట్టిన నీటి ప్రాజెక్టులు ఎన్ని పూర్తి చేసారు. ఎన్నింటి నుండి సాగుకు నిరంధిస్తున్నారు…?
 • మన తెలంగాణ నినాదం నీళ్ళు, నిధులు,నియామకాలు, ఇంటింటికి నల్లా, సాగు నీరు, తాగు నీరు , సాగునీటి ప్రాజెక్టులు కొత్త కంపనిలు,ఆదాయ వనరులు, ఇంటికో ఉద్యోగం అన్ని ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఎంతవరకు సాధించారు…? ఎన్ని నియామకాలు భర్తీ చేసారు..?
 • అన్నికులాలకు సమాన ప్రతిపత్తి కలిపిస్తూ దళితుడే తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మీ నినాదం నెరవేర్చరా…? మన ప్రభుత్వం లో అందరికి సమన్యాయం చేసారా…?
 • తెలంగాణ లోని అన్ని నియజక వర్గాలలో ప్రతి నియోజక వర్గంలో కనీసం 10 పది డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారా…? దళితులకు మూడు ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు…? చనిపోయిన అమర వీరుల కుటుంబాలను ఎంత మందిని పలకరించారు..? వారిని ప్రభుత్వం ఎలాంటి పథకాలతో అడుకుంటుంది….?చెప్పగలరు.
 • ఉద్యోగాల భర్తీ కే.జి.నుండి పి. జి ఉచిత విద్యా గురుకులాల పాఠశాలల నిర్మాణం ఎంతమేర సాధించారు…? చనిపోయిన బతికున్న, జర్నలిస్టులకు వారి కుటుంబాలకు మన ప్రభుత్వము ఎలాంటి భరోసా ఇచ్చింది…?
 • హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు ,రోడ్ల విస్తరణ డ్రైనేజి పనులు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయా…
 • నియోజక వర్గానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి, కాలేజీలు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ , ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు, నియోజక వర్గ అభివృది సాదించారా…?
 • బతుకమ్మ పండుగ పేరిట ఏటేటా వందల కోట్ల దుర్వినియోగం జరగటం లేదా ?
 • ఇంతకూ మునుపు మేము బతుకమ్మ అడలేదా..?లేదా ఎలా జరుపుకోవాలన్న విషయం మరచిపోయామా ?  తెలియదా ?
 • గొఱ్ఱెలు,బర్రెలు,చేపలు, ఈ స్కీములతో మా పిల్లలు మా పాత జీవితాలే జీవించాలా…?

మేము అడిగిన ప్రశ్నల్లో తప్పులుంటే మమ్మల్ని మన్నిస్తారని అడుగుతున్నాం సారూ నీ బాంచెన్…..మీరు ఎక్కువగా  ఇష్టపడే మీ తెలంగాణ ప్రజలు..!!

Please follow and like us:

You may also like...