సామాజిక మాధ్యమం లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న ?

  • గిరి పుత్రికను చిదిమేస్తే స్పందించారా?
  • అడవి బిడ్డలంటే అంత చులకనా?
  • 10 ఏళ్ళ చిన్నారి పై పాశవికం ?

ఆదిలాబాదు: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని ఒక యువకుడిని, దళితుడని,వేరే మతం వాడని,అందమైన జంటని విడదీసారని, అన్యాయంగా నరికి చంపారని ఒక్కొక్కరు గుండెలు బాదుకున్నారు.మీరు ఇలా బాధ పడుతూ స్పందించినందుకు చాలా సంతోషం.నేను కూడా చంపడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.నాకు మీకన్నా ఎక్కువ బాధ, కోపం కలిగింది.ఇక మహిళా మండలి వాళ్ళు, కుల సంఘాల నాయకులు,మీడియా బాగానే గొంతులు చించుకున్నాయి సంతోషం.ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సరిగ్గా మూడు నెలల క్రిందట మా ఉమ్మడి ఆదిలాబాద్ దళిత గిరిపుత్రిక,10ఏళ్ళ పాప స్పందనను ఇద్దరు కుక్కలు దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఇప్పుడు గొంతులు చించుకున్నవాళ్లు అంతా ఎక్కడ చచ్చారు. ఒక్క సంఘం వాళ్ళు కూడా కనీసం శవాన్ని చూడడానికి రాలేదు కదా.ఇదెక్కడి న్యాయం. అడవిబిడ్డలంటే ఎందుకంత చిన్న చూపు.ఒక్క మీడియా కూడా కవర్ చేయలేదే.అంటే డబ్బున్న వాళ్ళు చేసేవే హత్యలా..! అడవిలో ఉండేవాళ్ళు ఎంత దారుణంగా హత్య చేయబడ్డా మీకు కనిపించదా.బహుశా చనిపోయిన పాప అందంగా లేదనేమో. అయ్యా..!! మేమూ మనుషులమే.. మావికూడా ప్రాణాలే.మాపైన కూడా కొంచెం కనికరం చూపించండి.మళ్ళీ మాట్లాడితే మానవత్వం, దారుణం,అన్యాయం..!!ఏంటో ఈ జనాలు..!! అంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమం లో చక్కర్లు కొడుతున్న వైనం.

Please follow and like us:

You may also like...