సర్కారు బస్సులకేమైంది…?

  • తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..
  • వరుస సంఘటనల తో ప్రయాణీకులు బేజారు….

రాయగిరి కమాన్ దగ్గర ఉన్న డివైడర్ దగ్గర యాదగిరిగుట్ట నుండి రాయగిరి కమాన్ నుండి కుడివైపుగా భువనగిరి రోడ్డుకు వెళ్ళేందుకు.. రాంగ్ రూట్ లో కామాన్ వెనుక వైపు నుండి “పికెట్ డిపో టీఎస్ ఆర్టీసీ బస్సు ” డ్రైవర్ అతివేగంగా రాంగ్ రూట్ లో రాయిగిరి కమాన్ వెనుక వైపు నుండి రావడంతో ఒక బైక్,ఒక స్కూటీ వాహన దారులకు రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పింది.

ఒక టూవీలర్ బస్సు ముందు భాగంలో కొంత తగిలిన శబ్దంతో పడిపోయింది. దీంతో కొంత సమయం ఆ ద్విచక్ర వాహన దారులూ ఆ స్పాట్ లో ఉన్న జనం,వెంటనే బస్ ను అడ్డగించి డ్రైవర్ తో ఘర్షణ పడ్డారు. బస్ డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు వెళ్ళి పోయాడు.

ఈ కమాన్ దగ్గర ప్రతీరోజూ సాయంత్రం సమయంలో  చాలామంది విద్యార్థులు ప్రయాణీకులు ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ బస్సు డ్రైవర్ రాంగ్ రూట్ డ్రైవింగ్ వేగానికి ఆ ప్రాంతంలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు.

Please follow and like us:

You may also like...