సమకాలీన రాజకీయాల్లో అరుదైన ఘటన…

కేరళ : భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతల మయ్యింది. వరదలు ముంచెత్తాయి. దాదాపు 40 మంది మృత్యువాత పడ్డారు. వరదల వల్ల సంబవించిన నష్టాన్ని అంచనా వేయడానికి, కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్షించి, సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వామపక్షాలకు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పినరాయ్ విజయన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రమేష్ చెనితల ఉమ్మడిగా “ఏరియల్ సర్వే” చేయడం టీవిలో చూశాను.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయాల స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించిన ఆ ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందించాలని పించింది.

సైద్ధాంతిక, రాజకీయ అంశాలపై రాజీ లేని పోరు చేయవచ్చు! కానీ, సంకుచిత రాజకీయాలకు బానిసలు కాకూడదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఐక్యంగా, అండగా నిలవాలి. ఆ రాజకీయ విజ్ఞతను కేరళ నాయకులు ప్రదర్శించడం అభినందనీయం అభినందనీయం అని పలువురు కొనియాడుతున్నారు.

Please follow and like us:

You may also like...