Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

షామీ సప్లయర్ల ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో మంత్రి నారా లోకేష్…!

బీజింగ్/చైనా : పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనువైన పరిస్థితుల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

ఇండియాలో మొబైల్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది.అలాగే ఇండియా లో ప్రతి సంవత్సరం 480 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ వినియోగం ఉంటుంది.అందులో 240 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

స్టార్ట్ అప్ రాష్ట్రం గా వేగంగా అభివృద్ధి చెందుతున్నాం.నూతన రాష్ట్రంగా ఏర్పడిన కేవలం మూడున్నర ఏళ్లలోనే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం.అనుకున్న లక్ష్యాలు సాధించాలి అంటే 15 శాతం వృద్ధి సాధించాలి, ప్రస్తుతం 12 శాతం వృద్ధి సాధించాం.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ ఒన్ గా ఉన్నాం.

బెంగుళూరు,చెన్నై,విశాఖపట్నం కారిడార్లను వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నాం.రాష్ట్రంలో పరిశ్రామికాభివృద్ది వేగంగా అభివృద్ధి చెందుతుంది.ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం.ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారానే అభివృద్ధి సాధ్యం అని క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం.రాష్ట్రంలో అద్భుతమైన యువతీయువకులు ఉన్నారు.ఉద్యోగుల కొరత ఉండదు.అనేక కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి.

మీకు కావాల్సిన విధంగా మా యువతీ,యువకులకు శిక్షణ ఇచ్చి వెంటనే ఉద్యోగంలో చేరే విధంగా సిద్ధం చేస్తాం.కంపెనీ ఏర్పాటు కు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.రాష్ట్రంలో విద్యుత్ కోత అనే మాటే లేదు.24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తాం.అనుమతుల పేరుతో మీ సమయం వృధా చెయ్యం.కేవలం 21 రోజుల్లోనే మీకు కావాల్సిన అన్ని అనుమతులు కేటాయిస్తాం.8 నెలల్లో కంపెనీ ఏర్పాటు కు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తాం.రాయలసీమ జిల్లాలు తయారీ రంగానికి హబ్ గా మారుతున్నాయి.

అనంతపురం లో ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ కియా ఏర్పాటు అవుతుంది.కియా కంపెనీ పనుల ప్రారంభం నుండి మొదటి కారు ప్రొడక్షన్ కేవలం 15 నెలల్లో జరగబోతుంది.దేశంలో విద్యుత్ చార్జీలు పెంచబోము అని ప్రకటించిన ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కేవలం తొమ్మిది నెలల్లోనే నదుల అనుసంధానం చేసి చూపించాం.

గోదావరి,కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేసాం.మరిన్ని నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రం లో నీటి కొరత లేకుండా చేయబోతున్నాం.ఫాక్స్ కాన్ కంపెనీలో ఒకే చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.ఫాక్స్ కాన్,సెల్కాన్,కార్బన్,డిక్సన్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి.రిలయన్స్ జియో త్వరలోనే తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేస్తుంది.

గత నాలుగున్నర ఏళ్లలో ఆటోమొబైల్ రంగంలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి.స్టార్ట్ అప్ రాష్ట్రంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రపంచం అంతా తిరుగుతున్నాం.అందులో భాగంగా చైనా పర్యటనకు వచ్చాను.గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం.కంపెనీ అవసరాలకు అనుగుణంగా భూముల కేటాయింపు లేదా మౌలిక వసతులు కల్పించిన అద్దె భవనాలు ఏర్పాటు చేస్తాం.ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకునేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం.

షామి సప్లైయర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాను.ఆంధ్రప్రదేశ్ పై నమ్మకం ఉంచి కంపెనీ ఏర్పాటుకు అందరి కంటే ముందే నిర్ణయం తీసుకొని కంపెనీ ఏర్పాటు చేస్తున్న హొలీ టెక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు…మంత్రి నారా లోకేష్.

ఈ కార్యక్రమంలో ఐటీ, ఎలెక్ట్రానిక్స్ సెక్రెటరీ విజయానంద్, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులు,షామీ వైస్ ప్రెసిడెంట్ ఫెంగ్,సిఓఓ మురళి,హొలీ టెక్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్గ్,షామి సప్లైయర్ల్స్ పాల్గొన్నారు

Please follow and like us:

You may also like...