శ్రీ కృష్ణ జన్మదిన వేడుకలు జరుపుకోవాలి….!

గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్లలో యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ
కలియుగ దైవం ఆయన శ్రీ కృష్ణ భగవానుడు పుట్టినరోజు సందర్భంగా 02 వతేది ఆదివారం రోజున జరుపుకునే పండుగ అయిన శ్రీ కృష్ణ జయంతి వేడుకలను యాధవులందరు ఘనంగా జరుపు కోవాలని జిల్లా యాదవుల సంఘం ఉపాధ్యక్షుడు ఖాశివిశ్వనాథ్ రెడ్డి మండలంలోని యాదవులందరికి మండలంలోని బైలుప్పల,అగ్రహారం,పెద్దనెలటూరు,ఐరన్ బండ గ్రామాల్లో ఎక్కువ యాదవులు కలరని కాబట్టి కులమతాలకు అతీతంగా కలుపుకొని పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ శ్రీ కృష్ణుడు లోకరక్షకుడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అహర్నిశలు కృషి సల్పిన దేవుడు మన శ్రీ కుష్ణుడూ అని కొనియాడారు. ఇలాంటి దైవాన్ని కులాలకు అతీతంగా 2వతేదీ ఆదివారం శ్రీ కృష్ణ జయంతి రోజును ఘనంగా జరుపుకుని శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క కృపకు పాత్రులు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యాదవ సంఘం అధ్యక్షుడు నారాయణ,బాయి గడ్డ ఈరన్న,ఎర్రబాడు కందికారి రామయ్య,పెద్దనేలటూరు డీలర్ గొల్లరాముడు ,గాజులదిన్నె మునేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...