శ్రీకాకుళం జిల్లా వాసులకు అండగా….జన సేన!

తిత్లీ తుఫాన్ తో శ్రీకాకుళం జిల్లా వాసుల పరిస్థితి తెలిసిందే అయితే ఈ నేపధ్యం లో ఓ అడుగు ముందుకు వేసి జనసేన అదే వేగం తో తెలుగుదేశం పై మెరుపు వేగం తో అస్త్రాలను విసురుతున్న నేపధ్యం లో జనసేన ఏమంటున్నదో తెలుసుకుందాం. జనసేన కవాతుని విమర్శించడానికి పైడ్ ఆర్టిష్టులకి తిత్లీ తుఫాను దొరికింది.

తుఫాన్ పేరుతో విమర్శలు మొదలెట్టారు. ఈ సన్నాసులకి తెలియనిది ఏమిటంటే ప్రభుత్వానికి కన్నా ముందే స్పందించింది జనసైనికులు, సొంత డబ్బులతో సహాయ కార్యక్రమాలు చేస్తుంది జనసైనికులు. ఆర్మీలా పనిచేస్తున్నారు, బాదితులకి అండగా ఉంటున్నారు. తుపాను బాదితులకి నిస్వార్దంగా సేవ చేస్తుంది ఒక్క జనసేన కార్యకర్తలే…

టిడిపి కార్యకర్తలు పత్తా లేరు, బాదితులకి పంచే పులిహోర, వంటసామాగ్రి, ఇతర సహయాల్లో చేతివాటం చూపి అందిన కాడికి దోచేస్తున్నారు. పార్టీ పేరుమీద సొంత డబ్బు పైసా కూడా ఖర్చుపెట్టడం లేదు. ప్రభుత్వం ఇచ్చే వాటినే పార్టీ జెండాలు పట్టుకుని పంచుతున్నారు.

తుఫానుని అడ్డం పెట్టుకుని తమ వ్యాపారం పెంచుకుంటున్న చంద్రబాబు కుటుంబం. 
హెరిటేజ్ పాలు మాత్రమే ప్రభుత్వం తరుపున పంపిణీ…తుఫాన్ రూపంలో ఎప్పటినుండో నిలవ ఉన్న పాలపొడి అమ్ముకుంటున్నారు (పాలు అన్నీ స్వచ్చమైనవి కావు, డిమాండ్ ఎక్కువున్నప్పుడు పాలు లేకపోతే సగం పాలు, సగం పాలపొడి కలిపి అమ్మేస్తారు )…

=============================
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్త డాక్టర్ శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలు, నిత్యావసర వస్తువుల పంపిణీ, సహాయ కార్యక్రమలు.

దాదాపు 10 వేల కేజీల బియ్యం, లక్ష వాటర్ ప్యాకెట్లు, 50వేల బిస్కెట్లు ప్యాకెట్లు, 5000 దుప్పట్లో, మరియు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా.
దీంతోపాటు జనసేన ఆధ్వర్యంలో తుఫాను బాధిత ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, మందుల పంపిణీ మరియు సేవా కార్యక్రమాలు సహాయక చర్యలు చేపట్టారు

Please follow and like us:

You may also like...