శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు…!

శాకాంబరీ అలంకరణలో
ప్రత్యేక పూజలు నిర్వహించిన
జిల్లా కలెక్టర్ డా,శరత్ 
జిల్లా ఎస్పీ సింధూ శర్మ

జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా, శరత్ ,జిల్లా ఎస్పీ సింధూ శర్మ పూర్ణ కుంభ స్వాగతం పలికిన వేద పండితులు ,మరియు సాయంత్రం అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని వివిధ కూరగాయలతో అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించారు.

మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలు ఆట పాటలతో దేవాలయం ప్రాంగణం మారుమోగింది . మహిళలు , భక్తులు ప్రత్యేక పూజలు మహా పూజ , మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు.

కార్యక్రమంలో నవ దుర్గ సేవా సమితి కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...