శనివారం వరకు వర్షాలు పడే అవకాశం ?

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం రాత్రికి మరింత బలపడి తుపానుగా మారింది.

గురువారం రాత్రి 8.30 గంటల సమయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, కోస్తాంధ్రలోని కళింగపట్నానికి ఈశాన్యంగా 165 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురువారం అర్ధరాత్రి సమయానికి గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటే అవకాశముంది.

ఈ తుపాన్‌కు ‘దయె’ అని పేరు పెట్టారు. మయన్మార్‌ దేశం ఈ పేరు పెట్టింది.

తుపాన్‌ ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు అర మీటరు ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని తెలిపింది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తీరం వెంబడి ఉప్పెన మాదిరిగా సముద్రం ముందుకు పొంగే అవకాశం ఉందని హెచ్చరించింది.

తీరం దాటాక తుపాను వేగం మరింత పెరుగుతుందని వివరించింది.

శుక్రవారం సాయంత్రం వరకు తుపాన్‌ ప్రభావం ఉండొచ్చని అంచనా.

శుక్రవారం ఉదయం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.

రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఆ తరువాత దయె తుపాను బలహీనపడి శనివారం నాటికి వాయుగుండంగా ఉంటుందని వివరించారు.

శనివారం కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా.

Please follow and like us:

You may also like...