విభేదాలు గుప్పుమంటున్నాయి…

చొప్పదండి టిఆర్ఎస్ లో నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు….

కరీంనగర్/చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రము లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో చొప్పదండి ఎమ్మెల్యె శోభకి మరియు టిఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల మరియు ఎంపి వినోద్ సమక్షంలో మరో సారి బట్టబయలు అయ్యాయి.
చొప్పదండి మండల కేంద్రము లో ప్రారంభోత్సవములు ఉన్నవేళ   మున్సిపల్ కార్యాలయం మరియు ఫైర్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం నకు మంత్రి ఈటేల, ఎంపి వినోద్ తో ఎమ్ శోభ హాజరయ్యారు… ఈ సందర్భంగా ఉద్యమ నాయకుడు మార్కెట్ కమిటి ఛైర్మన్ భర్త చుక్కారెడ్డి, మంత్రి  ఎంపి గారి సమక్షంలో కొబ్బరికాయ కొట్టడానికి రాగా ఎమ్మెల్యే శోభ ఆగు అని ప్రక్కకి తొయ్యడంతో అక్కడే ఉన్న టిఆర్ఎస్ రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్,జడ్పిటీసి సాంబయ్య, మరియు వారి అనుచరులతో అక్కడి నుండి వెళ్ళిపోయారు……తర్వాత కార్యక్రమం అయిపోయాక మంత్రిగారు వెళ్ళేటప్పుడు ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రి గారితో మొరపెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు.

Please follow and like us:

You may also like...