విద్యా హక్కు చట్టం అమలు కోసం….!

కర్నూలు/ఎమ్మిగనూరు:ఈ రొజు ఎమ్మిగనూరు పట్టణము నందు ఎస్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ కత్తి నరసింహా రెడ్డి గారు పట్టణములొ ఉన్న వివిధ పాఠశాలలకు వెళ్ళి పాఠశాలలొ గల సమస్యలను, మరియు ఉపాధ్యాయ సమస్యలను తెలుసుకొన్నారు.రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ఈ యొక్క సమస్యలను ప్రభుత్వము ముందు ప్రస్తావనకు తెస్తానని పేర్కొన్నారు.  

అలాగే సర్వశిక్షాభియాన్ లొ పని చేస్తున్న పార్ట్ టైము టీచర్లుగా 2012 సంవత్సరము నుండి విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైము టీచర్ల పని వేళలను, పూర్తి పని వేళలుగా మార్చాలని మరియు వారి సర్వీసును క్రమబద్దీకరించలని, ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, మరియు పెండింగ్ వేతనాలు చెల్లించాలని , ఉద్యొగ భద్రత,ప్రావిడెంట్ ఫండ్/ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలని ,పాలసీ అడ్వైసరీ బోర్డ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని ఇంకా పార్ట్ టైము టీచర్ల వివిధ సమస్యల పై ప్రభుత్వం సత్వరమే స్పందించేలా చర్యలు చేపట్టాలని, పార్ట్ టైము టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.శ్రీనివాసుల నాయుడు, జిల్లా ఉపాద్యాక్షులు పి.శ్యాము సుందర్, కన్వినర్ వి.నాగరాజ రావు, స్టేట్ కమీటి సభ్యులు బి.రాజ శేఖర్, యం.అక్బర్ బాష, యన్. వసుంధర దేవి, తదితరులు వినతి పత్రం అందజేశారు.

Please follow and like us:

You may also like...