విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం…!

మహబూబ్‌నగర్: జిల్లాలోని అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలు ప్రచార సభ నిర్వహించారు. వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టీ విక్రమార్క, విజయశాంతి ఉండగా ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేతలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. స్టేజ్‌పైన ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు.

సభలో మాట్లాడేందుకు విజయశాంతి ముందుకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారికి కిందపడిపోయారు. అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు రాములమ్మను పైకి లేపారు. అయితే ఎవరికీ ఏం కాకపోవడంతో నేతలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Please follow and like us:

You may also like...