విఐపి ల భద్రతకు చర్యలు…!

జగిత్యాల : జిల్లాకు వచ్చే వివిఐపిలు, వి.ఐ.పి లు భద్రత గురించి (క్లోజ్ ప్రొక్సీ మెంట్ ట్రైనింగ్) ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ మొయినాబాద్ హైదరాబాద్ లో రెండు వారాల పాటు శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు, హెడ్ కానిస్టేబుల్ లు సుధాకర్, సూర్యప్రకాష్ కానిస్టేబులు మహేశ్, కార్తిక్, సరస్వతి లను గురువారం జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధు శర్మ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ రెండు వారాల పాటు ఎలాంటి రిమార్క్ లేకుండా వీఐపీల భద్రత శిక్షణ పూర్తి చేసుకున్నందుకు ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా కు వచ్చే వీఐపీలకు వచ్చినప్పుడు తమ నైపుణ్యాన్ని చాటాలని సూచించారు.

Please follow and like us:

You may also like...