లైంగిక వేధింపుల్లో కార్మికుడికి జైలు…!

10 ఏళ్ళ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అభియోగాల నేపథ్యంలో 24 ఏళ్ళ పాకిస్తానీ కార్మికుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం. జూన్‌ 7 అల్‌ బర్షాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలికను గట్టిగా కౌగలించుకుని, ఆమెను ముద్దాడినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. బాలిక బ్రిటిష్‌ జాతీయురాలు. శిక్ష ముగిసిన తర్వాత ఆ వ్యక్తిని డిపోర్ట్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యులు భోజనం చేసేందుకు ఒక్క చోట కూర్చున్న సమయంలో, బాలిక డల్‌గా వుండడం చూసి, ఆమె తండ్రి ఏమయ్యిందని అడగగా, జరిగిన విషయాన్ని తన తండ్రి దృష్టికి ఆ బాలిక తీసుకొచ్చింది. పెయింట్‌ చూడటానికి వెళ్ళిన తనను లైంగికంగా వేధించినట్లు బాలిక చెప్పడంతో, ఆమె తండ్రి పోలీసులకు విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేశారు. మరుసటి రోజు కార్మికుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Please follow and like us:

You may also like...