రోజుకు 20 వేలే…!

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డులతో నగదు ఉపసంహరణకు పరిమితులు 
క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్న బ్యాంక్‌ ఖాతాదారులు ఇప్పుడు రోజుకు రూ.40,000 వరకు నగదును ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే వీలుండగా, ఈ నెలాఖరు (అక్టోబరు 31 అర్థరాత్రి) నుంచి ఈ పరిమితిని రూ.20 వేలకు పరిమితం చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ అంటే అదో గొప్పగా భావించేవాళ్లం. ఎక్కడికెళ్లినా అందుబాటులో ఉండే ఏటీఎంలు మరియు టెక్నాలజీ పరంగా ఉత్తమ సేవలతో ముందుండేది. ఇప్పటి వరకు రోజువారీ పరిమితి 40వేలు ఉండగా, ఇకపై ఇది 20వేలు మాత్రమేనంట. సరిగ్గా పండగల సీజన్ లో స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం.. సామాన్య ప్రజలకు పెద్ద తలనొప్పి వ్యవహారమే!

నోట్ల రద్దు తర్వాత ఈ బ్యాంకులకు ఏం మాయరోగం వచ్చిందో కానీ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Please follow and like us:

You may also like...