రుణం తీర్చుకుందాం అంటున్న సామాజిక వేత్త…!

జగిత్యాల/శ్రీరాములపల్లె : జగిత్యాల జిల్లా శ్రీ రాములపల్లి కి చెందిన సామాజిక వేత్త రమేష్ రెడ్డి గడిచిన నాలుగున్నరేళ్ల లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి, సమాజం లో బీద ప్రజలకు అలాగే కష్టాల్లో ఉన్న వారికి పెద్ద దిక్కు అయి ఆపన్న హస్తం అందిస్తూ వచ్చాడు. గడిచిన ఈ కాలం లో ఎందరో నాయకులను కలిశారు, ఎన్నో చూసారు.ఈ నేపధ్యం లో వారు జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా ఓ కఠినమైన నిర్ణయం తీసుకుని ఈ మధ్యే మరి కొందరితో కలిసి వేరే పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీ లో చేరిన రమేష్ రెడ్డి మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ హయాం లో తెలంగాణ పోరాటం, నాటి ఆరాటం చుసిన నాటి యూపిఏ చైర్ పర్సన్  సోనియాగాంధీ  తెలంగాణ ఇచ్చారు.


కెసిఆర్  తెలంగాణ తెచ్చారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మన కెసిఆర్ ఇంత మొండిపట్టు పట్టకపోతే తెలంగాణ ఇవ్వకపోతుండే. సోనియాగాంధి ఇవ్వకపోతే, కెసిఆర్ ఎన్ని మిరాలు గొట్టిన రాకపోతుండే. ఆందుకే తెరాస పార్టీ కి అధికారం ఇచ్చి కెసిఆర్ రుణం తీర్చుకున్నాం.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి సోనియాగాంధి రుణం తీర్చుకుందాం అంటూ సామాజిక మాధ్యమాలు ద్వారా ప్రజలను చైతన్య వంతం చేస్తున్న శ్రీరాములపల్లి కి చెందిన సామాజిక వేత్త కె రమేష్ రెడ్డి ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గం తో పాటు జగిత్యాల జిల్లా లో సామాజిక మాధ్యమం లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.

Please follow and like us:

You may also like...