రాహుల్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం…!

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్బంగా గ్రామస్థులు, మహిళలు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. పర్యటన లో భాగంగా పలు పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా, జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన  గడప గడపకు తిరిగి ప్రచారం చేపట్టారు.అనంతరం బతికెపల్లి కొచ్చెరువు గుట్ట ఆంజనేయ స్వామి ఆలయానికి పార్టీ శ్రేణులతో వెళ్లి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని ముడుపు, మొక్కులు చెల్లించారు.

అనంతరం మీడియా తో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం ఉద్యమించడం తోనే, యువకుల,విద్యార్థుల ఆత్మ బలిదానాల వల్లనే సాధ్యం అయిందని గుర్తుచేశారు. ఆ బలవన్మరణాలకు ముగింపు పలకాలనే భావనతోనే సోనియా గాంధీగారు రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత చూపారన్నారు.
2014 లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలంటే ఉద్యమ పార్టీ తెరాస పార్టీ తోనే సాధ్యమవుతుందనే ప్రజలు బావించారన్నారు కానీ ఈ నాలుగేళ్ళ పాలనలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన చేసిందని ఎద్దేవా చేసారు. రాష్ట్రం నాలుగేళ్లలో ఒక నియంతృత్వ పాలనలో, ఒక రాచరిక పాలనలో మగ్గిందని మండిపడ్డారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగయ్యేలా పాలన జరిగిందన్నారు.ఆ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాల ఐక్యతతో ముందుకు సాగుతున్నామని, తెలంగాణా సమాజం ఆశీర్వదించి, అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల విష్ణు,మాజీ జడ్పీటీసీ శోభారాణి, అధికారప్రతినిది రాములుగౌడ్, స్వామి మాజీ ఎఎంసి చైర్మన్ ఒరుగల శ్రీను,మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,ఎంపీటీసీ కృష్ణహరి,గండ్ర వెంకట్ రావు,పూసల తిరుపతి,విజయ భాస్కర్,సతీష్ రెడ్డి,గుర్రం మల్లారెడ్డి, మెతుకువిష్ణు,రవి నాయక్,సంజీవ్,ప్రవీణ్,బర్ల రవి,మధు,కొండం మధుసూదన్ రెడ్డి,కడారి తిరుపతి,కిషన్,నీరటి రాజేందర్,కుంచె రాజేందర్ కట్ల తిరుపతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...