రాఫెల్ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం…ఏఐసీసీ సెక్రటరీ రాజీవ్ గౌడ!

యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయలను కాజేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం..

యాదాద్రి/భువనగిరి; జిల్లాలో రాఫెల్ కుంభకోణంపై ఏఐసీసీ సెక్రటరీ రాజీవ్ గౌడ విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు యుద్ధ విమానాల కొనుగోలు విషయంపై భారత ప్రభుత్వం ఇలాంటి ఆ సంస్థ సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం లేదని ఏదైతే సంస్థకు కాంట్రాక్టు ఇస్తున్నారు వారికి ఎలాంటి నైపుణ్యం లేదని ఫ్యాక్టరీ పెట్టిన 12 రోజులకే రిలయన్స్ కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్టును అప్పజెప్పడం దీని వెనుక పెద్ద కుంభకోణమే ఉందని త్వరలో మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలని యుద్ధ విమానాల కోసం 42 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది భారత ప్రభుత్వం దాన్ని వెంటనే చేయడానికి అదనంగా మరో లక్ష కోట్ల రూపాయలను కేటాయించింది మొత్తంగా 42 వేల కోట్ల రూపాయల కుంభకోణం యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో జరుగుతుందని దీన్ని ప్రజలకు తెలియజేసిన విషయం ఎంతైనా ఉందని, దాని కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి తెలియజేస్తున్నామని అన్నారు. యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో సంబంధిత శాఖ మంత్రిని కూడా తీసుకోకపోవడం ఆయన పర్యటించిన ఫ్రాన్స్ దేశంలో దేశానికి సంబంధించిన ఎవరిని తీసుకోకపోవడం భారతదేశానికి శత్రువైన భారతదేశం యుద్ధం ప్రకటించిన ఆదేశంతో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ఈ కాంట్రాక్టును అప్పజెప్పడం చైనా లోని బ్యాంకులకు లక్షలకోట్ల అప్పులు తీసుకుని ఎగనామం పెట్టిన రిలయన్స్ అప్పజెప్పడం సర్వత్ర విమర్శలు ఉన్నాయని రాజ్యసభలో చర్చిస్తే వాయిదా తీర్మానం పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బిక్షమయ్య గౌడ్ భువనగిరి నియోజకవర్గం ఇన్చార్జి అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Please follow and like us:

You may also like...