యథేచ్ఛగా గో అక్రమ రవాణా…..!

కృష్ణాజిల్లా/నవాబు పేట:ఓ ప్రక్క దేశం లో చట్టాలు గోవధ కు విధివిధానాలు ఖరారు చేసిన,నిభందనలు ఆంక్షలు పెట్టినా వాటిని కొందరు తుంగలో త్రొక్కుతున్నారు.వాటికి ఎదురొడ్డాల్సి వస్తున్న దుస్థితి. సమాజం లో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి నేడు సమాజం లో దాపురిస్తుంది.ఇది ఇలాగే ఉంటే ప్రజలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఓట్ల తో కొందరు కొరకరాని కొయ్యల తయారై, మరికొందరు మతవిద్వేషాల తో పబ్బం గడుపుకుంటున్నారు.

అటు గద్దెనిక్కిన ప్రభుత్వాలు,వారు అనుసరిస్తున్న విధి విధానాలు ఎన్ని వచ్చిన కొందరిని ఏమి చేయలేని రాజ్యాంగాలు,చట్టాలలో ఉన్న లొసుగులు వారికీ చుట్టం అవుతున్నాయి.లా అండ్ ఆర్డర్ కూడా కొందరి విషయం లో కళ్లకు గంతలు,చేతులకు సంకెళ్లు తో కట్టిపడేస్తున్నాయి.ఈ నేపథ్యంలో  నిన్న జరిగిన సంఘట ఓ మచ్చుతునక మాత్రమే.ఇటు చేస్తున్న వారు, చేయిస్తున్న వారు ఎందరో ఉంటున్నప్పటికీ, చేతికి చిక్కిన వారే దొంగలు. ఎందరో చట్టానికి చిక్క కుండా అక్రమార్కులు దొరల్లా తిరుగుతూనే ఉన్నారు. అనునిత్యం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు తప్ప అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం.

ఇలాంటిదే నిన్న విజయవాడ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గోవుల డీసిఎం వ్యాన్ సీజ్ చేయడం జరిగిందని వివరాల ప్రకారం తెలుస్తున్నది.

వివరాల్లోకి వెళితే స్థానికం గా వాకబు చేసే  రోడ్ సేఫ్టీ అధికారులు డీసిఎం ను ఆపి నవాబుపేట వద్ద అనుమానంతో  తనిఖీలు నిర్వహించి క్రమం లో వాహనదారుడు చెప్పిన వివరాలు సరిగా లేకపోవడం తో వాహనం ను పూర్తిగా పరదా తో కట్టి ఉన్నదాన్ని విప్పించి చూడగా అందులో నిభందలకు విరుద్ధం గా రవాణా చేయడం తో పాటు లేగదూడలు,ఆవులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన సదరు రోడ్డు సేఫ్టీ అధికారులు.

డీసిఎం వ్యాన్ ను పరిశీలించగా దాంట్లో సుమారు 30 లేగదూడలు, ఆవులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు స్పందించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరిన  పోలీసులు వెంటనే పెనుగంచిప్రోలు స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసుల కథనం ప్రకారం తెలుస్తున్నది.

తనిఖీ చేస్తున్న పోలీసు అధికారి
Please follow and like us:

You may also like...