ముమ్మాటికీ మానవ తప్పిదమే…?

జగిత్యాల: దేశ వాసులను ఒకింత ఆశ్చర్యం,అలాగే చాలా భాధ ను కలిగించిన దుర్ఘటన ఈరోజు ఉదయం 11:30 నిమిషం ల ప్రాంతం లో తెలంగాణ ఆపద మొక్కుల వాడు కొండగట్టు అంజన్న పాదాల చెంతన ఘాటు రోడ్డులో గల రెండో స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళ్తున్న ఇండికా కారు బ్రేక్ వేయడం తో కార్ కు తగులుతుందన్న ఆలోచనతో ఎదురుగా వస్తున్నటాటా ఏస్ ఆటో కు మూలన గుద్ధి అలాగే వేగం తో  వెళ్లి ఎదురుగా ఉన్న లోయలో ముందు బాగం తో మట్టి దిబ్బకు గుద్ది మూడు పల్టీలు కొట్టినట్లు తెలుస్తున్నది.

ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సమయం లో బస్సుల్లో అధిక మొత్తం లో ప్రయాణికుల తో ఉండటం తో ఫుట్ బోర్డ్ మీద ఉన్న ప్రయాణికులు ముందరి డోర్ వద్ద, వెనుక డోర్ వద్ద ఉన్న ప్రయాణీకులు ఒక్కసారిగా తోపుకు గురి అవ్వడం తో,దాదాపు పది నుండి 12 మంది అక్కడే ప్రక్కకి పడినట్లు తెలుస్తుంది.స్వల్ప గాయాల తో ప్రక్కన పడ్డ సదరు ప్రయాణీకులు,ఆర్టీసీ బస్సు లోయలో పడ్డ వెంటనే స్పందించిన వారు వీరే అయ్యారని ప్రత్యక్ష సాక్ష్యుల వివరాలని బట్టి తెలుస్తుంది.సంఘట స్థలం లో క్షతగాత్రులను చేరవేయుటలో మల్యాల సీఐ వారి సిబ్బంది తో పాటు అక్కడి స్థానికులు చేయూత నిచ్చి ముందున్నారు.

సేవలో ముస్లిం యువకులు

క్షతగాత్రులు జగిత్యాల పట్టణం లో గల ఏరియా ఆసుపత్రికి చేరగానే జగిత్యాల పట్టణ సీఐ రత్నపురం ప్రకాష్ తనదైన శైలిలో వాహనాల ద్వారా,అంబులెన్సు ల ద్వారా చేరగా స్వయంగా తన స్వహస్తాలతో ఆసుపత్రిలోకి తరలించి మానవత్వం చాటుకున్నారు.అప్పటికే పెద్ద ఎత్తున తరలించి వచ్చిన జగిత్యాలకు చెందిన మహమ్మదీయ సోదరులు ఆసుపత్రిలో రోప్ పార్టీ లా సేవలు అందించారు.

అలాగే మరికొంత మంది మృతులను మార్చురీ రూమ్ వద్దకు చేర్చుటలో అలాగే క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి అంబులెన్సు ల ద్వారా చేర్చుటలో ముందున్నారు.ఈ సంఘటన జరిగిన బస్సులో దాదాపు వందకు పైచిలుకు ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

దీనికి అంతా జగిత్యాల డీఎం హన్మంతరావు అని తెలుస్తున్నది.ఇదే ఘాట్ రోడ్డులో ఓ లారీ అయ్యప్పస్వాములు తో నెత్తురోడగా,మరో జీప్ కూడా బోల్తా పడగా ఈ రహదారిని మూసి వేయగా,ఈయన గత ఐదారు రోజులుగా ఈ మార్గాన్ని అంటే నాచుపల్లి మీదుగా దొంగల మఱి క్రాస్ రోడ్డు కు చేరి మల్యాల చేరవలసిన ఆర్టీసీ బస్సును జెఎంటీయు శనివారం పేట మీదుగా కొండగట్టు ద్వారా ఘాటు రోడ్డు మార్గాన కేఎంపీఎల్ పెంచడమే ధ్యేయంగా ఈ మార్గాన్ని పునరుద్ధరణ కు ఒడిగట్టి నేడు వందల కుటుంబాలు క్షోభకు కారణమయ్యాడు.

శనివారం పేట మృతదేహాలు

ఉదయం పదకొండు గంటల సమయాన ప్రయాణం మొదలై పది పదిహేను నిమిషాల తరువాత మృత్యు వాత ఒడిలోకి ఒరిగిపోతే క్షతగాత్రులు ఆసుపత్రుల పాలవ్వగా,బాధితుల కుటుంబాల రోదనలు అరణ్యరోదనలై ఓదార్చలేని దుస్థికి ఒరిగిపోయారు.

బాబా ఆటో యూనియన్ కార్యదర్శి

పోలీసులు క్షతగాత్రుల కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి పరిస్థితులను కట్టడి చేశారు.రక్త దానం చేయుటకు స్వచ్చందంగా యువకులు ముందుకు వచ్చి రక్త దానం చేసి మానవత్వం చాటుకొనగా,జగిత్యాల మున్సిపాలిటీ వారు చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కుటుంబాల సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయడం తో పాటు చల్లని నీరును అందిస్తూ, అరటిపళ్ళను పంచి మానవత్వం చాటుకున్నారు. ఆసుపత్రికి చేర్చిన వారిలో పదుల సంఖ్యలో మృత్యువాత పడటం సిబ్బంది నిర్లక్షమే కారణమని తెలుస్తున్నది.కొందరు జగిత్యాల పట్టణం కు చెందిన డాక్టర్లు వచ్చినట్లు తెలుస్తున్నది.

జవాత్…డ్రైవర్…ఇస్లాంపుర.
  • డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి..జగిత్యాల.
  • వైద్యం కోసం జగిత్యాల వస్తూ….
  • ఏరియా ఆసుపత్రిలో క్షతగాత్రుల్లో ఓ నిండు గర్భిణి ఉండగా తమ పేషంటుగా తెలుసుకున్న జగిత్యాల పట్టణం లోని అరుణ హాస్పిటల్ వైద్యులు ఎల్లాల శ్రీనివాస్రెడ్డి ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందిస్తూ గైనకాలజి డాక్టరు కు తగు జాగ్రత్తల గురించి వివరించి వైద్యం అందించి మానవత్వం చాటుకున్నారు.
డా.ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి వైద్య నిపుణులు…జగిత్యాల.
  • సురభి రావ్…జగిత్యాల.
  • మీ కుటుంబ సభ్యులుంటే తెలిసేది..?
  • ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం ఎవరో కాదు ( ఆర్టీసి ) అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఇంత మంది చనిపోయి, వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి , ఇప్పటికి అయినా మారండి , దయచేసి బస్సులు మార్చండి.అందులో మీ కుటుంబం వాళ్ళు ఎవరయినా ఉంటె ఆ బాధ మీకు తెలిసేది.
సురభి రావ్..జగిత్యాల.
Please follow and like us:

You may also like...