ముందుకొస్తున్న దాతలు…!

అమరావతి: తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం కళాశాల అధ్యాపకుల ఒకరోజు వేతనాన్నిముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన ‘ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్’

సోమవారం మధ్యాహ్నం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్ అందించిన అసోసియేషన్ నాయకులు.

తిత్లీ తుఫాను తీవ్రతతో తల్లడిల్లిన ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అండగా నేనున్నానంటూ అక్కడే ఉండి సమస్యలు పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని అధ్యాపక సమాజం సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపిన అసోసియేషన్ నాయకులు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.1, 71, 346 విరాళాన్ని అందించిన నటసింహం బాలయ్య అభిమానులు.

బాలయ్య అభిమానుల తరుఫున ఈ విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించిన మన బాలయ్య డాట్ కాం నిర్వాహకుడు పుల్లెల గౌతమ్

తుపానుతో కష్టాలు పాలైన ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలను అభినందించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న సుమారు వెయ్యిమంది అధ్యాపకుల వేతన సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించిన ఆ సంఘం నేతలు.

అధికారులతో మాట్లాడి గెస్ట్ ఫ్యాకల్టీల వేతన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

వినతులు అందించేందుకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ సాదరంగా ఆహ్వానించి వారి సమస్యలు తెలుసుకుని వేళకు భోజనం పెట్టి పంపించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

Please follow and like us:

You may also like...