మా గోడు వినండి, చూడండి అంటున్న మదనాపుర గ్రామ వాసులు…!

  • మేము తిత్లీ తుఫాను మరియు వంశధార వరద భాదితగ్రామ రైతు బిడ్డలం
  • ఆల్ ఇస్ వెల్ యూత్, మదనా పురం గ్రామము ,కొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా వాసుల వినతి…!

మాఊరు మదనా పురం(కొత్తూరు మం) వచ్చిన తిత్లీ తుఫాన్ మా గ్రామాన్ని అతలాకుతలం చేసింది. తుఫాను ఆపై వంశధార వరద కలగలసి కష్టపడి రక్తాన్ని పెట్టుబడిగా మార్చి పండించిన వ్యవసాయ పంటలను చేతికి వచ్చే దశలో పూర్తిగా నాశనం చేశాయి. చెట్లు పూర్తిగా నేలకొరిగాయి. పశువులు చెల్లాచెదురు అయ్యాయి.. వరద ఉదృతి పెరిగి గ్రామాన్ని చుట్టుముట్టి ఊరు కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చినా సరైన రహదారి లేక బయటకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.. విద్యుత్తు లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నాసనమైంది అసలు గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో, మా గ్రామస్తులు ఎలా ఉన్నారో ఎమి బాధలు పడుతున్నారో తెలియక గ్రామం బయట ఉన్న మేము తల్లడిల్లాము.. ఇందులో భాదకరమైన విషయమేమంటే ప్రకృతి మా పై కన్నెర్రచేసింది. ఆ కష్టకాలంలో ఆదుకోవాల్సిన రాజకీయ నాయకులకు 
లేదా ప్రభుత్వ అధికారులకు మా ఊరు ఒకటుందని అందులో మనుషులు ఉన్నారని కనీసం గుర్తు లేదు.

నీచమైన రాజకీయ నాయకులకు ఎలాగూ మా కష్టాలు అనేవి కనబడవు ………………………..
కనీసం(మీడియా) మీకైనా కనబడలేదా ..
………………………….
ఒక ఛానల్ పనికిమాలిన పార్టీల రాజకీయల కోసం గంటలపాట చర్చలు…………………….
ఇంకోఛానల్ ఓ రాజకీయనాయకుని ఇంటిపై ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలుపై రోజంతా ఒక్కటే లైవ్ న్యూస్, చర్చలు……………..
మరో ఛానల్ ఒక ప్రేమికుని హత్యకోసం 20రోజులుగా రోజుకు 4గంటల చర్చలు పెట్టి దానిపై కుల గజ్జిని జోడించి న్యూస్…………………..
ఒక్క హిరో చనిపోతే రోజంతా live………….
ఒక సినిమా హిట్టైతే గంటలపాటు చిటచాట్……………………………
తుఫాను, వరదలు కారణంగా సర్వం కపోయిన మా శ్రీకాకుళం వాసుల కష్టాలు మీకు కనపడలేదు
ఇదేనా మీవల్ల ప్రజలకు జరిగే మేలు………….మనిషిగా పుట్టినందుకు కనీస జాలిలేదా మీకు ఇందులో కూడా trp లు కావాలా…….

ఎక్కడో కేరళ వరదలకు కదిలిన ఎందరో తెలుగు ప్రముఖులైన సినీ, రాజకీయ, పారిశ్రామిక వేక్తలు, ఉద్యోగులు మరియు సామాన్య ప్రజలకు మా ఉత్తరాంధ్రపై విరుచుకుపడ్డ ప్రళయం కనపడకపోవటం భాదకరమైన విషయం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వెనకపడ్డది అందులో మా శ్రీకాకుళం కూడా ఇంకా చాలా వెనకపడ్డ జిల్లా. ఈ విపత్తుతో మరో కొన్నేళ్ళు పాటు వెనక్కు వెళ్ళాం….. మానవతా దృక్పథంతో ఆలోచించండి సిక్కోలును ఆదుకోండి…. 

Please follow and like us:

You may also like...